Fennel Seeds: సోంపు తినడం వల్ల లాభాలు ఏంటి? ఎవరు తినాలి? ఎవరు తినకూడదు?
సోంపు గింజలను గింజలను మనం అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. ఎందుకంటే సోంపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సోంపు గింజలు సహాయపడుతాయి. సోంపులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే సోంపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. సోంపును వంటల్లో వేయడం వల్ల సువాసన, రుచి వస్తుంది. సోంపు గింజలను మౌత్ ఫ్రెషనర్ ఉపయోగించవచ్చు. ఫలితంగా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. వేయించిన సోంపును పంచదార మిఠాయిలో కలిపి తింటే దగ్గు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా స్వరానికి మాధుర్యం వస్తుంది. సోంపు టీని ఉదయాన్ని పరిగడుపున తాగడం వల్ల స్థూలకాయం అదుపులో ఉంటుంది.
సోంపును వీరు అస్సలు తినకూడదు
ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే.. సోంపును తినడం వల్ల కొందరు దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా మెడిసిన్స్ తీసుకునే వారు సోంపు గింజలను తినకపోవడం మంచింది. ఈ విషయంలో వైద్యుడి సంప్రదించాక తీసుకోవాలి. మీకు తుమ్ము సమస్య ఉంటే.. సోంపు తినకూడదు. మీరు సోంపు తినడం వల్ల మీకు తుమ్ముల సమస్య మరింత పెరుగుతుంది. మీకు కడుపు నొప్పి సమస్య కూడా రావొచ్చు. సోంపు తినడం వల్ల పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ ఇది శిశువు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. సోంపు చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఇది ఎక్కువగా తింటే హానికరం. మీకు అలెర్జీ సమస్య ఉంటే అస్సలు సోంపు తినకూడదు.