ఆరోగ్యం: శరీరంలో కొవ్వు తగ్గించడం నుండి కళ్ళకు ఆరోగ్యాన్ని అందించే ఈ మిరపకాయ గురించి తెలుసుకోండి
పాప్రికా.. లామంగ్ సమూహంలోని క్యాప్సికం రకం మిరపకాయల నుండి తయారు చేయబడిన మిరపకాయ మసాలా ఇది. ఈ మసాలా దినుసుల్లో అనేక పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు విటమిన్ ఏ, బి, సి ఇంకా కె పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం పాప్రికా వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. క్యాన్సర్ ను నిరోధిస్తుంది ఈ మసాలా దినుసుల్లో క్యాన్సర్ ను నిరోధించే కెరటానాయిడ్స్ అయిన బీటా కెరాటిన్, లుటిన్, జిక్సాంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుపడే కాప్సాయిసిన్ కూడా ఇందులో ఉంది.
కంటి సమస్యలను దూరం చేసే మసాలా దినుసు
నొప్పులను తగ్గిస్తుంది: ఇందులో ఉండే కాప్సాయిసిన్ కారణంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, ఆర్థరైటిస్, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది: మన శరీరంలో మంచి కొవ్వు చాలా అవసరం. ఈ మసాలా దినుసులోని పోషకాలు శరీరంలో మంచి కొవ్వులను పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే చెడు కొవ్వును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది: ఈ మసాలా దినుసులో విటమిన్ ఈ, బీటా కెరాటిన్, లుటీన్, జిక్సాంతిన్ ఉండడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతేకాదు వయసు పెరగడం వల్ల వచ్చే అనేక కంటికి సమస్యలను రాకుండా ఆపడంలో ఈ మసాలా దినుసు సహాయపడుతుంది.