జ్ఞానదంతం నొప్పి పెడుతోందా? ఇంటి చిట్కాలు ప్రయత్నించండి
ఈ వార్తాకథనం ఏంటి
జ్ఞానదంతం వచ్చేటపుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. దవడ మూలలో మరో దంతానికి స్థలం లేనపుడు ఈ దంతం వస్తుంది. అందుకే దవడ మూలలో నొప్పి కలుగుతుంటుంది.
జ్ఞానదంతం వచ్చినపుడు వైద్యుడిని ఖచ్చితంగా సంప్రదించాలి. అయితే వైద్యుడిని సంప్రదించడం ఆలస్యం అయితే గనక, కొన్ని ఇంటి చిట్కాలు జ్ఞానదంతం వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం.
ఉప్పునీళ్ళతో పుక్కిలించడం:
పంటినొప్పిని తగ్గించడంలో ఉప్పునీళ్ళు చాలా మేలు చేస్తాయి. ఉప్పులో ఉండే లక్షణాలు పంటినొప్పిని, చిగురువాపును తగ్గిస్తాయి.
జ్ఞానదంతం నొప్పి తగ్గాలంటే 250మిల్లీ లీటర్ల నీటిలో 2టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి నోట్లో పోసుకుని 15సెకన్లు పుక్కిలించి ఉమ్మివేయాలి. ఒకరోజులో కనీసం మూడుసార్లు చేయాలి.
Details
నొప్పిని తగ్గించే జామ ఆకు
లవంగాల నూనె:
జ్ఞాన దంతం నొప్పి తీవ్రంగా ఉంటే లవంగాల నూనె బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి.
దూదిని లవంగాల నూనెలో ముంచి జ్ఞానదంతం నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ నూనెను అద్దాలి. దీనివల్ల తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకులు:
జామ ఆకులను నెమ్మదిగా నమలడం లేదా జామ ఆకులను నీళ్ళలో ఉడకబెట్టి, ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం లాంటివి చేస్తే నొప్పి తగ్గుతుంది.
పసుపు:
పసుపు, ఉప్పు, ఆవాల నూనె కలిపి పేస్ట్ తయారు చేసి, ఆ పేస్టును నొప్పి కలిగిన ప్రదేశంలో పెట్టుకోవాలి. దీనివల్ల నొప్పి తగ్గిపోతుంది.