
తెల్లజుట్టుతో ఇబ్బందిగా ఉందా? ఈ పనులు చేస్తే తెల్లజుట్టు నల్లబడే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
వయసేమో 20, జుట్టు చూస్తే మాత్రం 60 ఏళ్ల ముసలివాడికి మల్లే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో తెల్లజుట్టు యుక్త వయసులోనే వచ్చేస్తోంది.
మరి ఆ తెల్ల జుట్టును నల్లగా మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఉందని చెప్తున్నారు వ్యానిటీ వ్యాగన్ ఫౌండర్ నైనా రుహేల్.
అసలు తెల్లజుట్టు ఎలా వస్తుంది? దాన్ని తిరిగి నల్లని జుట్టుగా మార్చడానికి ఏం చేయాలో నైనా ఇక్కడ వివరిస్తున్నారు.
తెల్ల జుట్టు రావడానికి కారణాలు
జన్యు సమస్యలు, ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, జీవన విధానాలు మొదలైనవన్నీ తెల్ల జుట్టు రావడానికి కారణాలు నిలుస్తాయట.
అలాగే తెల్లని జుట్టును నల్లగా మార్చడం ప్రతి ఒక్కరిలో సాధ్యం కాదని నైనా అంది.
Details
కేశ సంరక్షణ కోసం ప్రకృతిలో లభించే పదార్థాలు
తెల్లజుట్టు నల్లని జుట్టు గా మారాలంటే ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్థాల ద్వారా సాధ్యమవుతుందని నైనా చెబుతోంది.
హెయిర్ మాస్క్
కలబంద, కొబ్బరి నూనె, మందారం, మెంతులు మొదలగు ప్రకృతి పదార్థాలతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుంటే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. ఈ కారణంగా జుట్టు తెల్లబడే అవకాశం ఉండదు.
హానికర రసాయనాలున్న ప్రోడక్టులను వాడరాదు
జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించే ప్రోడక్టులలో హానికర రసాయనాలైన సల్ఫేట్లు, పారాబెన్స్, సింథటిక్ ఫ్రాగ్రాన్సెస్ ఉండకపోతే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
రసాయనాలు లేని కలర్
తెల్లబడ్డ జుట్టును కవర్ చేసుకోవడానికి అమోనియా, పీపీడీ, రిసోర్సినాల్ వంటి రసాయనాలున్న ప్రోడక్టులను వాడకుండా ప్రకృతిలో లభించే హెన్నా వాడటం మంచిది.