పెళ్ళిలో జుట్టు అందంగా ఉండాలంటే పెళ్ళికి ముందు జుట్టు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ముహుర్తాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళిళ్ళకు వెళ్లేవారైనా, పెళ్ళి చేసుకునే వారైనా తమ జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తీసుకోవాలి కూడా. ఆ శ్రద్ధ తీసుకునేటపుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. స్ట్రెయిటెనింగ్ వాడకపోవడం మంచిది: స్ట్రెయిటెనింగ్ పరికరాల వల్ల జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ పరికరాల నుండి వచ్చే వేడి జుట్టును పలుచగ చేస్తుంది. దానివల్ల జుట్టు రాలిపోవడం, బలహీనంగా మారిపోవడం జరుగుతుంది. స్ట్రెయిటెనింగ్ చేసుకోవాలనుకుంటే తక్కువ వేడితోనే చేసుకోవాలి. వేడి నుండి కాపాడే పేస్టులను వాడటం మంచిది. వేడినీటితో స్నానం వద్దు: నీళ్ళు మరీ వేడిగా ఉంటే జుట్టుకు సమస్య అవుతుంది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి
సరైన ఆహారం తీసుకోకపోతే జుట్టు దెబ్బ తింటుంది
షాంపూ ఎక్కువగా వాడకండి: రోజూ షాంపూ చేస్తే జుట్టు పొడిబారిపోతుంది. మీ జుట్టు రకాన్ని బట్టి ఒకరోజు తప్పించి మరో రోజు లేదా వారంలో రెండుసార్లు మాత్రమే వాడాలి. కావాల్సినన్ని నీళ్ళు తాగండి: శరీరంలో నీటిశాతం తగ్గితే దాని నష్టం జుట్టు మీద కూడా పడుతుంది. అసలే ఇది వేసవికాలం కాబట్టి కావాల్సినన్ని నీళ్ళు తాగండి. దానివల్ల జుట్టు తేమగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. సరైన ఆహారం తీసుకోండి: గుడ్లు, ఆకుకూరలు, చేపలు, గింజలు, విత్తనాలు తీసుకోవడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. వీటన్నింటినీ మీ ఆహారంలో చేర్చుకుంటే మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి