జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు
ఈ వార్తాకథనం ఏంటి
కొబ్బరి పాలు అనగానే ఇదెక్కడ దొరుకుతుందోనన్న అభిప్రాయానికి వచ్చేయకండి. ఈ పాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కొబ్బరితోనే. ముందుగా, కొబ్బరి పాల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం అందరికీ సమస్యగా మారింది. చాలామంది ఈ విషయంలో పెద్దగా జాగ్రత్త పడట్లేదు. అందరికీ జుట్టు ఊడిపోతుంది, నాకూ ఊడిపోతుందని తేలికగా తీసుకుంటున్నారు.
జుట్టు ఊడకుండా కొబ్బరి పాలతో ఆపేయవచ్చని మీకు తెలిసినపుడు తేలికగా తీసుకోకండి.
జుట్టు పెరుగుదలకు సాయం చేసే కొబ్బరి పాలు:
కొబ్బరి పాలలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కుదుళ్ళు బలంగా తయారై ఊడిపోకుండా ఉంటుంది.
కేశ సంరక్షణ
కొబ్బరి పాల ఉపయోగాలు, తయారీ విధానం
జుట్టు పాడవడాన్ని తగ్గిస్తుంది:
హెయిర్ స్టైలింగ్ కోసం హీటింగ్ సాధనాల వల్ల వెంట్రుకలు పాడవుతాయి. దీన్ని నివారించడానికి కొబ్బరి పాలు పనిచేస్తాయి.
పొడిబారడాన్ని తగ్గిస్తుంది:
పొడిబారడం వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. కొబ్బరి పాలను జుట్టుకు పట్టిస్తే, జుట్టు తేమగా ఉంటుంది.
కొబ్బరి పాల తయారీ:
కొబ్బరికాయ తీసుకుని అందులోని కొబ్బరిని బయటకు తీసి, చిన్నచిన్న ముక్కలుగా కోసి, గ్రైండర్ లో వేయాలి. అప్పుడు కొబ్బరి మెత్తగా, నుజ్జునుజ్జుగా తయారవుతుంది. దాన్ని బయటకు తీసి ఒక వస్త్రంలోకి తీసుకుని మూట కట్టి కొబ్బరి పాలను పిండుకోవాలి.
అలా వచ్చిన పాలను తలకు పట్టించి రాత్రి పడుకుని తెల్లారి తలస్నానం చేస్తే చాలు.