మీ స్నేహితులకు అప్పు ఇచ్చారా? వసూలు చేయడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి
ఫ్రెండ్స్ కి డబ్బిచ్చినపుడు వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడగడం కన్నా ఇబ్బంది మరోటి ఉండదు. అడిగితే ఏమనుకుంటారోనన్న అనుమానంతో చాలామంది అడగకుండా ఆగిపోతుంటారు. కానీ డబ్బు అందరికీ అవసరమే. అలాంటప్పుడు స్నేహితుల నుండి డబ్బు వసూలు చేయడానికి కొని టెక్నిక్స్ ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. డబ్బివ్వమని గొడవ పెట్టుకోవద్దు: డబ్బులు ఇంకా ఇవ్వట్లేదని చెప్పి గొడవకు దిగవద్దు. దానివల్ల ఫ్రెండ్ షిప్ పాడవుతుంది. మీకు డబ్బు అవసరముందని వాళ్ళకి కొన్ని క్లూస్ ఇవ్వండి. ఎమర్జెన్సీ క్రియేట్ చేయండి: మీ ఫ్రెండ్ ఇచ్చే డబ్బుతో చాలా పనుందని ఎమర్జెనీ క్రియేట్ చేయండి. కానీ అది మరీ భయాందోళనలకు దారితీసేలా ఉండకూడదు.
స్నేహితుల నుండి అప్పు వసూలు చేయడానికి కావాల్సిన టెక్నిక్స్
కొన్నిసార్లు డబ్బులకు బదులు లంచ్, డిన్నర్ తీసుకోండి, ఒకానొక సమయంలో మీరూ, మీ ఫ్రెండ్ కలిసి రెస్టారెంట్లో తిన్నారు. మీ ఫ్రెండ్ డబ్బులు మీరే ఇచ్చారు, అతను మళ్ళీ మీకు తిరిగి ఇవ్వలేదు. అలాంటి సమయాల్లో అవతలి వాళ్ళను ఇబ్బందిపెట్టకుండా లంచ్ ప్లాన్ చేయండి. పిలిస్తే వెళ్ళకండి: వీకెండ్స్ లో ఎక్కడికైనా వెళ్దామని మీ ఫ్రెండ్ పిలిస్తే, డబ్బులు లేవు, మంత్ ఎండ్ కదా అనో, లేక వేరే వాటిని అమౌంట్ ఖర్చయ్యిందనో చెప్పండి. వాళ్ళకు విషయం అర్థమవుతుంది. కొన్ని సౌకర్యాలు ఇవ్వండి: డబ్బు కన్నా ఫ్రెండ్ షిప్ ముఖ్యం. అందుకే అవతలి వాళ్ళు మీ డబ్బు కట్టడానికి కొన్ని సౌకర్యాలు కల్పించండి. ఒకేసారి మొత్తం చెల్లించలేకపోతే వాయిదా పద్దతిలో చెల్లించనివ్వండి.