బంధం: వేధించే బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చేయాల్సిన పనులు
మీ స్నేహితులు గానీ, మీ జీవిత భాగస్వామి గానీ మిమ్మల్ని పదే పదే అసహ్యించుకుంటున్నారా? ఎదుటివారి ముందు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరున్నప్పుడు మీకు అనీజీగా అనిపిస్తుందా? వీటన్నింటికి మీ సమాధానాలు అవును అయితే మీ బంధం విషపూరితమైనదని చెప్పుకోవచ్చు. ఇలాంటి బంధం నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటకి రావాలి. లేదంటే మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. పనుల మీద మీ ఫోకస్ పోతుంది. ఐతే ఒక బంధం నుండి బయటకు రావడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. ప్రస్తుతం, విషపూరితమైన బంధాల నుండి బయటకు రావాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
విషపూరిత బంధాల నుండి బయటపడే మార్గాలు
నిర్ణయానికి కట్టుబడి ఉండండి: మీరు బంధంలోంచి వెళ్లాలనుకుంటే అవతలి వాళ్ళు అంత ఈజీగా వెళ్ళనివ్వరు. విడిచి వెళ్ళొద్దని బ్రతిమాలతారు. మీరక్కడ లొంగిపోతే వాళ్ళు మళ్ళీ మీ మీద పెత్తనం చలాయిస్తారు. కాంటాక్ట్ కట్ చేయండి: వాళ్ళ నంబర్ డిలీట్ చేయండి. సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయండి. మీకు నచ్చిన హాబీవైపు దృష్టి మరల్చండి. కొత్త హాబీలను సృష్టించుకోండి. వ్యాయామం: ఒక బంధం తెగిపోయినపుడు మానసికంగా డౌన్ అవుతారు. అందుకే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. ధ్యానం అలవాటు చేసుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫీలింగ్స్ రాయండి: కొన్నిసార్లు మీ బాధను చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. అలాంటప్పుడే పెన్ను, పేపర్ తీసి మీ బాధనంతా రాసేయండి. మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది.