మీ పార్ట్ నర్ గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయా? మీకు ఓసీడీ ఉందేమో చెక్ చేసుకోండి
రిలేషన్ షిప్ ఓసీడీతో బాధపడే వారిలో తమ భాగస్వామి గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. తమ భాగస్వామి తమకు కరెక్ట్ కాదేమో అని, ఇంకా మంచి పార్ట్ నర్ వచ్చేదేమోనని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచనలు సాధారణంగా అప్పుడప్పుడు అందరికీ కలుగుతుంటాయి. కానీ క్రమం తప్పకుండా ఆ ఆలోచనలు మీ బుర్ర తినేస్తుంటే మీరు రిలేషన్ షిప్ ఓసీడీతో బాధపడుతున్నట్లు లెక్క. రిలేషన్ షిప్ ఓసీడీతో బాధపడేవారు తమ పార్ట్ నర్ తమను విడిచి వెళ్తారేమోనని ఫీలవుతారు. ఇంకా, భాగస్వామిలో ఉన్న లోపాలు పదే పదే గుర్తుకొస్తాయి. లోపాలు ఉండకూడదు కదా, అనవసరంగా ఈ పార్ట్ నర్ తో రిలేషన్ లోకి వచ్చానా అనిపించి ఇతర పనుల మీద మీ దృష్టి దెబ్బతింటుంది.
రిలేషన్ షిప్ ఓసీడీ కారణాలు, రకాలు ప్రభావాలు
ఈ ఓసీడీ రావడానికి స్పష్టమైన కారణాలు ఎవ్వరికీ తెలియదు. కానీ చిన్నప్పుడు కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు, డిప్రెషన్, లవ్ ఫెయిల్యూర్ వంటి వాటివల్ల రిలేషన్ షిప్ ఓసీడీ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో రెండు రకాలున్నాయి. మొదటి రకంలో తమ పార్ట్ నర్ తో ఉన్న బంధం చుట్టూ రిలేషన్ షిప్ ఓసీడీ ఉంటుంది. అదే రెండవ రకంలో తమ పార్ట్ నర్ లోని వ్యక్తిగత విషయాలు, గుణాలు, అలవాట్ల చుట్టూ రిలేషన్ షిప్ ఓసీడీ ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రంగా మారితే అవతలి వారికి సరైన రెస్పెక్ట్ ఉండదు. బంధానికి బీటలు వారే ప్రమాదం ఉంటుంది. రిలేషన్ షిప్ పూర్తిగా దెబ్బతింటుంది.