ఆన్ లైన్ డేటింగ్: మీ పార్ట్ నర్ ని కలవాలనుకుంటున్నారా? ముందు ఈ ప్రశ్నలు అడగండి
టిండర్, బంబుల్ లాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ సాయంతో పార్ట్ నర్ ని ఆన్ లైన్ లో కలవడం చాలా చిన్న విషయం. అదే పార్ట్ నర్ తో మంచి బంధం ఏర్పర్చుకోవడం అనేది పెద్ద విషయం. ఆ బంధం ఏర్పడాలంటే ఒకసారైనా రియల్ లైఫ్ లో పార్ట్ నర్ ని కలవాలి. మీరలా కలవాలనుకుంటే ముందుగా కొన్ని ప్రశ్నలు అడగాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. పొద్దున్న లేవగానే నిన్ను ఉత్సాహ పరిచేది ఏంటి: ఈ ప్రశ్న వెనకాల చాలా లోతైన విషయం దాగుంది. ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం వల్ల అవతలి వారు లైఫ్ లో ఎంత సీరియస్ గా ఉన్నారనేది తెలుస్తుంది.
ఆన్ లైన్ పార్ట్ నర్ ని ఆఫ్ లైన్ లో కలవాలనుకుంటే అడగాల్సిన ప్రశ్నలు
రోల్ మోడల్ ఎవరు: ఇది సాధారణమైన ప్రశ్నే, కానీ దానికి వచ్చే ఆన్సర్ ని బట్టి, అవతలి వారికి విలువలు, లక్షణాలు అర్థం అవుతాయి. దాన్ని బట్టి అవతలి వారు సీరియస్ గా ఉన్నారా లేదా అర్థం చేసుకోవచ్చు. మీ కుటుంబం ఎక్కడ ఉంటుంది, వాళ్లని రెగ్యులర్ గా కలుస్తావా: కుటుంబ బంధాలకు విలువ ఇచ్చేవాళ్ళకు స్నేహబంధం విలువ తెలుస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ అంటే అమ్మానాన్న అని కాదు, ఆలంబనగా ఉండే ఎవ్వరితో అయినా సరే వాళ్ళ రిలేషన్ ఎలా ఉందో తెలుసుకోండి. మీ గతంలోని డేటింగ్ అనుభవాన్ని దెబ్బ తీసిన సంఘటనలు ఏంటి: ఈ ప్రశ్న అడిగినపుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కావచ్చు. కానీ ఆ ఇబ్బందిలో సమాధానం దొరుకుతుంది.