డేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఆఫీసు పని, ఇంటి పనులు, ఇతర పనులు, ఫ్రెండ్స్ తో పార్టీలు.. వీటన్నింటి మధ్యలో డేటింగ్ అంటే ఊహించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. గజిబిజీ జీవితంలో డేటింగ్ కి సరైన సమయమే లేకుండా పోతుంది. మీ మనసు మీకో తోడు కావాలని కోరుకున్నప్పుడు మీ పర్సనల్ పనుల వల్ల మీ తోడుని మీరు కనుక్కోలేకపోతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు నిజంగా బిజీగా ఉన్నారా? చాలామంది బిజీగా ఉన్నామని చెప్పుకుంటారు. ఎందుకంటే డేటింగ్ లోకి దిగితే మళ్ళీ అనవసర ఇబ్బందులు వస్తాయని వాళ్ళ భయం. కొత్త వాళ్ళను కలుసుకోండి: రెస్టారెంట్ లో కూర్చుని చేతిలో ఫోన్ పట్టుకుని, చెవిలో ఇయర్ ఫోన్స్ తగిలించుకుంటే మీ దగ్గరికి ఎవ్వరూ రారు.
డేటింగ్ జీవితానికి కావాల్సిన మరికొన్ని టిప్స్
మీ వర్క్ స్టైల్ తెలిసిన వాళ్ళతో డేట్ చేయండి. మీరు ఎవరితో బంధాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారో వారికి మీ వర్క్ లైఫ్, దాని స్టయిల్ తెలిసేలా చేయండి. లేదంటే మీ రోజువారి షెడ్యూల్ అవతలి వాళ్ళను డిస్టర్బ్ చేసి బంధానికి బీటలు వారేలా చేస్తుంది. నిజాయితీగా ఉండండి. మీ వర్క్ గురించి అవతలి వారికి నిజాయితీగా చెప్పండి. ఆఫీసులో పనిలో ఉన్నానని చెప్పి, మళ్ళీ బయట పార్టీలో కనిపిస్తే బాగుండదు. అతిగా ఆశించకండి: ఏ బంధాన్నైనా బద్దలు గొట్టేవి ఆశలే. మీ దగ్గర టైమ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించవద్దు. వాళ్ళు చేసే పనికి గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు కూడా మీ పనికి (జాబ్) గౌరవాన్ని ఇస్తారు.