బంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు
ప్రతీ స్నేహమూ ఆనందాన్ని ఇస్తుందనుకుంటే పొరపాటే. కొంతమంది స్నేహితులు మీ పక్కనే ఉంటూ ప్రతీసారీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. పదిమందిలో మీ గురించి చులకనగా మాట్లాడుతూ మీ గౌరవానికి భంగం కలిగిస్తారు. అలాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. వాళ్ళ చేష్టల్ని వారికి తెలియజేయండి: మీ స్నేహితుడి చర్యల వల్ల మీకు బాధగా అనిపిస్తే, ఆ విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పండి. నులా అన్నావ్, ఆ మాటలు నాకు బాధగా అనిపించాయి అని తెలియజేయండి. కూర్చుని మాట్లాడండి: అవతలి వారు మీకు చాలా రోజుల నుండి స్నేహితులైతే ఒక దగ్గర కూర్చుని వాళ్ళకు అర్థమయ్యేలా వివరించండి. దానివల్ల వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళేం చేస్తున్నారో అర్థం అవుతుంది.
మనసును గాయపరిచే స్నేహాల నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు
కొన్నిరోజులు వాళ్ళను కలవకండి: మిమ్మల్ని వేధించే వాళ్ళతో దూరంగా ఉండండి. కాల్స్, మెసేజ్ లకు సమాధానం ఇవ్వకండి. సోషల్ మీడీయాలో అన్ ఫాలో అవ్వండి, మనసు ప్రశాంతంగా మారుతుంది. నమ్మకంగా ఉండే స్నేహల వైపు వెళ్ళండి: స్నేహాన్ని వదులుకోవడం చాలా కష్టం. ఆ టైమ్ లో మీ మనసు మరో స్నేహాన్ని కోరుకుంటుంది. నమ్మకంగా ఉండే ఇతర స్నేహితులతో కలవండి. మిమ్మల్ని వేధించే స్నేహితుడు కూడా మీ ఇతర స్నేహితులకు స్నేహితుడైతే, అతడితో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో మీ ఇతర స్నేహితులకు తెలియజేయండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి: స్నేహాన్ని వదులుకునే సమయాలు కఠినంగా ఉంటాయి. దాన్నుండి బయటపడటానికి మీ ఫ్యామిలీతోఎక్కువ సమయం గడపండి, బాగా నిద్రపోండి.