
ట్రావెల్: ఇండియాలోని అత్యంత ఎత్తులో గల సరస్సులను ఎప్పుడైనా చూసారా?
ఈ వార్తాకథనం ఏంటి
పర్యాటకాన్ని ఇష్టపడేవారు సరస్సుల గురించి తెలుసుకోవాలి.
హిమాలయ ప్రాంతాల్లో ఉండే సరస్సులు, అత్యంత ఎత్తులో ఉంటాయి. చలికాలంలో ఈ సరస్సులు పూర్తి మంచుతో గడ్డకట్టి ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలోని అత్యంత ఎత్తులో ఉండే సరస్సుల గురించి తెలుసుకుందాం.
గురుడోంగ్ మర్ సరస్సు: సిక్కింలో ఉన్న ఈ సరస్సు, 17,800 అడుగుల ఎత్తులో ఉంటుంది. భారత బౌద్ధ గురువు పద్మసంభవ, ఈ సరస్సును కనుగొన్నారని చెబుతుంటారు.
సూరజ్ తాల్: హిమాచల్ ప్రదేశ్ లో ఉండే ఈ సరస్సు, సముద్ర మట్టం నుండి 4890మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సు నుండే బాగా నది జన్మిస్తుంది. అక్కడి ప్రాంత ప్రజలు ఈ నదిని చాలా పవిత్రంగా భావిస్తారు.
ఈ నదిలో మంచుకొండల ప్రతిబింబాలు చూపరులను అబ్బురపరుస్తాయి.
ట్రావెల్
అత్యంత ఎత్తులో ఉండే సరస్సులు
త్సోంగ్ మో సరస్సు: చుట్టూ దట్టమైన అడవులు, పర్వతాలతో ఉండే ఈ సరస్సు, సముద్ర మట్టానికి 12000అడుగుల ఎత్తులో ఉంటుంది. రుతువును బట్టి ఈ సరస్సులోని నీరు రంగులు మారుతుంది. వర్షాకాలంలో నీలిరంగులో ఉంటే, చలికాలంలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
సో లామో సరస్సు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సుల్లో ఒకటిగా పిలవబడే ఈ సరస్సును చొలాము సరస్సు అని కూడా అంటారు. టిబెట్ బోర్డర్ కి దగ్గరగా ఉండే ఈ సరస్సు, 20,300అడుగుల ఎత్తులో ఉంటుంది.
పాన్ గాంగ్ సరస్సు: సముద్ర మట్టం నుండి 4225మీటర్ల ఎత్తులో ఉండే ఈ సరస్సులోని నీరు ఉప్పగా ఉంటుంది. ఐతే ఈ సరస్సులోని 50శాతం టిబెట్ లో, 50శాతం లడక్ లో ఉంటుంది.