NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / గోవా వెళ్లాలనుకుంటున్నారా? కార్నివల్ లో జరిగే ప్రాంక్ సాంప్రదాయం గురించి తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    గోవా వెళ్లాలనుకుంటున్నారా? కార్నివల్ లో జరిగే ప్రాంక్ సాంప్రదాయం గురించి తెలుసుకోండి
    ఫిబ్రవరి 18వ తేదీ నుండిమొదలయ్యే గోవా కార్నివాల్

    గోవా వెళ్లాలనుకుంటున్నారా? కార్నివల్ లో జరిగే ప్రాంక్ సాంప్రదాయం గురించి తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 15, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్యటకులను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గోవా. అందులో భాగంగానే గోవా కార్నివాల్ ని తీసుకువచ్చేస్తోంది. కళలు, సాంప్రదాయాలు, వినోదం, ఆహారం ఇలా ఎన్నో రకాల ఆకర్షణలు గోవా కార్నివాల్లో మిమ్మల్ని కనువిందు చేస్తాయి.

    ఈ కార్నివాల్ ఫిబ్రవరి 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉంటుంది.

    కార్నివాల్ చరిత్ర:

    ఈ కార్నివాల్ ని మొదటగా మొదలుపెట్టింది పోర్చుగీసువారు. 500 సంవత్సరాల క్రితం గోవాను పోర్చుగీసు వారు పరిపాలించారు. అప్పట్లో కేథలిక్స్ మాత్రమే ఈ కార్నివాల్లో పాల్గొనేవారు, కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయి మతాలకు అతీతంగా ఈ కార్నివాల్ ని జరుపుతున్నారు.

    డాన్స్, మ్యూజిక్, డ్రింక్స్. ఇలా ఆహ్లాదపరిచే అన్ని హంగులు కార్నివాల్ లో కనిపిస్తాయి.

    గోవా కార్నివాల్ 2023

    స్నేహితులను ప్రాంక్ చేసే సాంప్రదాయం కలిగిన కార్నివాల్

    నాలుగు రోజుల పాటు సాగే ఈ కార్నివాల్, పంజిం, వాస్కోడిగామా, మాపుసా, మార్గావ్ లోని బీచ్ లలో జరుగుతుంది. అందువల్ల ఈ నాలుగు బీచ్ లను చాలా అందంగా తయారు చేస్తారు.

    వినోదానికి చిరునామాగా ఉండే ఈ కార్నివాల్, ఈ సంవత్సరం కూడా అదే తరహాలో సిద్ధమైంది. ఎక్కడ చూసినా రంగురంగుల బట్టలు ధరించిన మనుషులు, మేకప్ లతో మెరిసే జనాలు, ఆహ్లాదపరిచే సంగీతం, కనువిందు చేసే డ్యాన్సులు, కడుపు నింపే గోవా ఆహారం ప్రధాన ఆకర్షణ.

    ఈ కార్నివాల్ లో అస్సాల్టీస్ అనే సంప్రదాయం కనిపిస్తుంది. కార్నివాల్ రోజుల్లో మొహానికి వింతగా మేకప్ వేసుకుని, తమ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు. ఒకవేళ ఆ ఫ్రెండ్.. వీళ్ళని గుర్తుపట్టకపోతే పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025