Loading...
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ.404 కోట్ల భారీ రైల్వే ప్రాజెక్ట్.. ఇక షేర్లపై ఫోకస్!
నవరత్న కంపెనీకి రూ.404 కోట్ల భారీ రైల్వే ప్రాజెక్ట్.. ఇక షేర్లపై ఫోకస్!

RVNL New Order: నవరత్న కంపెనీకి రూ.404 కోట్ల భారీ రైల్వే ప్రాజెక్ట్.. ఇక షేర్లపై ఫోకస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(RVNL)కు తూర్పు కోస్ట్ రైల్వే నుంచి భారీ ప్రాజెక్టు దక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కంపెనీ సెప్టెంబర్ 19న స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా వెల్లడించింది. జీఎస్టీతో కలిపి ఈ కాంట్రాక్ట్ మొత్తం విలువ రూ.404.88కోట్లుగా ఉంది. ఈ వర్క్ ఆర్డర్‌లో భాగంగా నిరుగుండి-బారాంగ్, ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు సుమారు 385 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులనుRVNLచేపట్టనుంది. ఈ ప్రాజెక్టులో రోడ్‌బెడ్ నిర్మాణంతో పాటు చిన్న, పెద్ద వంతెనల నిర్మాణం, వంతెనల కింద రోడ్ల నిర్మాణం, బిల్డింగ్ పనులు, పర్మినెంట్ వే లింకింగ్, సబ్‌వేల నిర్మాణం, ఇతర అనుబంధ పనులు కూడా ఉన్నాయి.

వివరాలు

షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి

ఈ మొత్తం నిర్మాణ పనులను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీకి 912 రోజుల గడువు ఇచ్చారు.

RVNLకు ఈ భారీ ప్రాజెక్టు దక్కిన నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు కదలికలపై ఇన్వెస్టర్ల దృష్టి నెలకొనే అవకాశం ఉంది.

గత వారంలోని చివరి ట్రేడింగ్ రోజున RVNL షేరు సుమారు 4 శాతానికి పైగా లాభపడింది. దీంతో రూ.210.30 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

అయితే స్వల్పకాలిక పనితీరును పరిశీలిస్తే షేరు ధరలో క్షీణత నమోదైంది.

గత ఒక నెలలో RVNL షేరు 6.64 శాతం పడిపోయింది. మూడు నెలల్లో 15 శాతం, ఆరు నెలల్లో 23 శాతం చొప్పున క్షీణించింది.

వివరాలు

52 వారాల గరిష్టం.. కనిష్టం ఎంతంటే?

ఇక గత ఒక సంవత్సరంలో ఈ షేర్లను హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు దాదాపు 42 శాతం వరకు నష్టాన్ని చవిచూశారు.

ఇదే సమయంలో బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 10.50 శాతం నష్టపోగా.. RVNL షేరు అంతకంటే ఎక్కువ క్షీణతను నమోదు చేసింది.

ప్రస్తుతం RVNL షేరు 52 వారాల గరిష్ట ధర రూ.400.90గా ఉంది. 52 వారాల కనిష్ట ధర రూ.195.20గా నమోదైంది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,847 కోట్లుగా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడులు

గత రెండేళ్ల కాలంలో RVNL షేరు ధర సుమారు 60 శాతం మేర పడిపోయింది.

అయితే దీర్ఘకాలికంగా పరిశీలిస్తే ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడులను అందించింది. గత మూడేళ్లలో RVNL షేరు 27 శాతం లాభాన్ని అందించింది.

ఇక ఐదేళ్ల కాలంలో ఏకంగా 598 శాతం మేర భారీ రాబడిని అందించింది.

ADVERTISEMENT