Punjab: విధుల్లో ఉన్న ఏఎస్సైపై కాల్పులు.. అమృత్‌సర్‌లో పోలీస్ అధికారి మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) మృతి చెందారు. అమృత్‌సర్‌లోని భగ్తావాలా గ్రెయిన్ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ASI హర్జీత్ సింగ్ భగ్తావాలా గ్రెయిన్ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో పలుమార్లు కాల్పులు జరిపారు.
వివరాలు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఈ కాల్పుల్లో హర్జీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మృతి చెందిన ASI హర్జీత్ సింగ్ తర్న్ తరన్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.