కిచెన్‌లో ఉండే వస్తువులతోనే నోటి దుర్వాసనను ఇలా తగ్గించుకోండి
భోజనం చేసిన తర్వాత కొన్ని ఆహారాల కారణంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని పోగొట్టడానికి మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో దొరికేవి కాకుండా మీ వంటగది లో ఉండే ఏయే వస్తువులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా భోజనం చేసిన తర్వాత నోటి నుంచి వచ్చే వాసనను దూరం చేయడానికి పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను చంపేస్తాయి. అందుకే టూత్ పేస్టు లలో పుదీనా ఒక పదార్థంగా ఉంటుంది.
లవంగాలతో దుర్వాసన మాయం
లవంగాలలో ఉండే పోషకాలు, నోటి దుర్వాసనను దూరం చేయడమే కాకుండా చిగుళ్ళ నుంచి రక్తం కారడం, పళ్ళు పుచ్చిపోవడం మొదలగు సమస్యలను తగ్గిస్తుంది. అందుకే భోజనం చేయగానే రెండు లవంగాలను నోట్లో వేసుకోండి. దాల్చిన చెక్క లవంగాల మాదిరిగానే దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోట్లోని బాక్టీరియా చనిపోయి దుర్వాసన తగ్గిపోతుంది. తులసి ఆకులు తులసి ఆకుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నోటి నుంచి వచ్చే చెడు వాసనను పోగొట్టడానికి ఎండబెట్టిన తులసి ఆకులను పొడిగా చేసి, ఆ పొడితో పళ్ళు తోముకోవాలి. లేదంటే సింపుల్ గా కొన్ని తులసి ఆకులను తీసుకొని నమిలితే సరిపోతుంది. నోటి పూత వంటి సమస్యలను తగ్గించడంలో తులసి సాయపడుతుంది.