NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Dry Skin Remedies: చర్మం పొడిబారుతుందా? అయితే నివారణకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి 
    తదుపరి వార్తా కథనం
    Dry Skin Remedies: చర్మం పొడిబారుతుందా? అయితే నివారణకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి 
    చర్మం పొడిబారుతుందా? అయితే నివారణకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి

    Dry Skin Remedies: చర్మం పొడిబారుతుందా? అయితే నివారణకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి 

    వ్రాసిన వారు Stalin
    Nov 06, 2023
    07:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చలికాలం వచ్చిందంటే చాలా మంది చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.

    దీంతో ఈ కాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు, ఆరోగ్యకరమైన స్కిన్ కోసం మాయిశ్చరైజర్స్‌ను ఉపయోగిస్తుంటారు.

    అయితే మీరు తీసుకునే ఆహారాల ద్వారా, ఇంటి చిట్కాల ద్వారా కూడా పొడి చర్మం నుంచి ఉపశమనం పొందవచ్చు.

    కొబ్బరి నూనె

    కొబ్బరి నూనె(Coconut oil)లో ఎమోలియెంట్ లక్షణాలు ఉంటాయి. ఎమోలియెంట్లు చర్మ కణాల మధ్య ఖాళీలను నింపి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఇందులో సహజంగా లభించే సంతృప్త కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి నిత్యం మృదువుగా ఉండేలా చేస్తాయి.

    పొడి చర్మం

    పెట్రోలియం జెల్లీతో అద్భుత ప్రయోజనాలు

    పెట్రోలియం జెల్లీ(Petroleum jelly) ఉత్పత్తులను పెద్దవారు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి చర్మాన్ని పొడిబారకుండా చేస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.

    జెల్లీని మినరల్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ జెల్లి చర్మ పొరను కప్పేసి తేమ ఉండేలా చేస్తుంది. పొడి, చికాకు కలిగించే చర్మ సమస్యలను నివారించడంలో పెట్రోలియం జెల్లీ ఉత్పత్తులు అద్భుతంగా పని చేస్తాయి.

    చేతి తొడుగులు(Gloves)

    ఇంటి పనులు చేస్తున్నప్పుడు లేదా తీవ్రమైన చలిలో బయట ఉన్నప్పుడు ఇన్సులేట్ చేయబడిన గ్లౌమ్స్ ధరించడం వలన పొడి, చికాకు కలిగించే చర్మ సమస్యలను నివారించవచ్చు.

    పొడి చర్మం

    వోట్మీల్ స్నానం చక్కటి పరిష్కారం

    వోట్మీల్ స్నానం(సన్నగా గ్రైండ్ చేసిన ఓట్స్) అనేది చికాకు కలిగించే చర్మ సమస్యకు చక్కటి పరిష్కారం. శతాబ్దాలుగా అమ్మమ్మలు, నానమ్మలు ఈ ఇంటి చిట్కానే పాటిస్తున్నారు.

    కొల్లాయిడల్ ఓట్‌మీల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చికాకును తగ్గిస్తాయి.

    అంతేకాకుండా దురద నుంచి ఈ ప్రక్రియ చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు వోట్మీల్ స్నానం(Oatmeal baths) చేసిన తర్వాత, మీ చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకుంటే మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.

    పొడి చర్మం

    యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3తో లాభాలు 

    చర్మం పొడిగా ఉన్నప్పుడు.. యాంటీఆక్సిడెంట్లు(Antioxidants,) ఒమేగా-3 ఆహారాలు తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    యాంటీఆక్సిడెంట్లు ఉండే బ్లూబెర్రీస్, టమోటాలు, క్యారెట్లు, బీన్స్, బటానీలు, పప్పు‌తో పాటు సాల్మన్ వంటి ఒమేగా-3(omega-3s) ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాలు కూడా చర్మానికి మరింత దోహదం చేస్తాయి.

    వేడి నీటితో స్నానం వద్దు

    డ్రై స్కిన్ నుంచి ఉపశమనం పొందడం కోసం వేడి నీటితో స్నానం చేయడం మానుకోవాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ పేర్కొంది.

    వేడి నీరు చర్మానికి హాని చేస్తాయి. అందుకే గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయడం మంచిది. సువాసన లేని, సున్నితంగా ఉండే సబ్బులను ఉపయోగించడం బెటర్.

    పొడి చర్మం

    హ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించడం

    హ్యూమిడిఫైయర్(humidifier) ద్వారా గాలిని శుభ్రం చేయొచ్చు. ఇది ఇంట్లో గాలిలో తేమ ఉండేలా దోహదపడుతుంది.

    ఇప్పుడు చాలా మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. అలెర్జీ, చికాకు కలిగించే కారకాలకు దూరంగా ఉండాలి మీరు రోజు చేసే కొన్ని పనుల వల్ల కూడా చర్మ పొడిబారుతుంది.

    ఆ పనులను ఏంటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలి. పొయ్యి దగ్గర కూర్చోవడం, క్లోరినేటెడ్ లేదా రసాయనికంగా శుద్ధి చేసిన నీటిలో ఎక్కువ సమయం గడపడం, ఉన్ని దుస్తులు ధరించడం వంటివి మీ చర్మాన్ని చికాకు పెట్టడంతో పాటు పొడిగా ఉంచుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చర్మ సంరక్షణ
    చలికాలం
    తాజా వార్తలు
    ఇంటి చిట్కాలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చర్మ సంరక్షణ

    హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు హోలీ
    చర్మ సంరక్షణకు ఉపయోగపడే రోజు వారి ఆహారాలు లైఫ్-స్టైల్
    హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్ హోలీ
    హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్ హోలీ

    చలికాలం

    కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV ప్రైమ్
    యోగసనాలతో ముడతలు దూరం యోగ
    'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం నిద్రలేమి
    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చిరంజీవి

    తాజా వార్తలు

    KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?  తెలంగాణ
    హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు  ఇజ్రాయెల్
    Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్  మరాఠా రిజర్వేషన్
    Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు అన్నారం బ్యారేజీ

    ఇంటి చిట్కాలు

    ప్రపంచ ఆస్తమా దినోత్సవం: చరిత్ర తెలుసుకోవాల్సిన విషయాలు, నియంత్రించే చిట్కాలు  లైఫ్-స్టైల్
    జ్ఞానదంతం నొప్పి పెడుతోందా? ఇంటి చిట్కాలు ప్రయత్నించండి  లైఫ్-స్టైల్
    మీ ఇంట్లో మూల మూలన ఉన్న బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు మీకోసం  గృహం
    చర్మ సంరక్షణ: దద్దుర్ల నుండి విముక్తి పొందడానికి ఈ టిప్స్ పాటించండి  చర్మ సంరక్షణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025