Telugu language day 2024: దేశ భాషలందు తెలుగు లెస్స.. మాతృ భాష గొప్పదనం ఇదే
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవ రాయులు చెప్పిన, చెయ్యేతి జై కొట్టు తెలుగోడా అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు చెప్పారు. మన మాతృభాషను కాపాడుకోవడమే కాకుండా భావితరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించారు.
గిడుగు రాముర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం
హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడుకొనే భాష తెలుగు. ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉన్నారు. ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. తెలుగుకవి గిడుగు వెంకట రాముర్తి జయంతి సందర్భంగా ప్రతేడాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఏడాది కవి గిడుగు వెంకట రాముర్తి 161 జయంతి వేడుకలు జరుగుతున్నాయి
తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి
ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. ఇక తెలుగు భాషను ప్రోత్సహించేందుకు వేమన, సుమతీ శతకాలు వంటి పద్యాలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నారు. ఇక వారికి తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.