
Good Health : మధుమేహం ఉన్నవారు తప్పక తినాల్సిన చిరుధాన్యాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
మధుమేహంతో బాధపడే వారికి ఆకలి ఎక్కువగా వేయడం సర్వసాధారణం. కానీ ఆకలి వేయగానే ఏది పడితే అది తినడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచనుంది. ఈ సమస్యకు చిరుధాన్యాలు ఒక చక్కటి పరిష్కారం అని వైద్యులు చెబుతున్నారు.
కొర్రలు, సామలు, అరికలు, ఊదలు వంటి చిరుధాన్యాలను క్రమంగా తినడం వల్ల మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా శరీరం ఆరోగ్యంగా నిపుణులు చెబుతున్నారు. దినచర్యలో పద్ధతిగా మార్చుకోవాలి
కొర్రలు: 2 రోజులు
సామలు: 2 రోజులు
అరికలు: 2 రోజులు
ఊదలు: 2 రోజులు
అండు కొర్రలు: 2 రోజులు
Details
2. తయారుచేసే పద్ధతి
ముందు నుంచి కావలసిన ధాన్యాలను కొనుగోలు చేయండి
వండడానికి ముందుగా ధాన్యాలను 3-6 గంటలపాటు నీటిలో నానబెట్టాలి
3. ఆరోగ్య ప్రయోజనాలు
చిరుధాన్యాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.
ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల మధుమేహంతో పాటు బరువు తగ్గడం కూడా సులభమవుతుంది.
చిరుధాన్యాల క్రమమైన వాడకం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి ఇవి గొప్ప మిత్రంగా మారతాయి.
క్రమం తప్పకుండా చిరుధాన్యాలతో వండిన ఆహారం తినడం ద్వారా బరువులో సానుకూల మార్పు తెలుసుకోవచ్చు.