Tourism Destinations: భారతదేశంలో మనసుకు ప్రశాంతతనిచ్చే పర్యాటక ప్రదేశాలు ఇవే.. ఫుల్ రిలాక్స్ గ్యారంటీ
ట్రాఫిక్ సౌండ్ల నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో... గడిపే కొన్ని రోజులు మన మానసిక స్థితిని ఎంతో మెరుగుపరుస్తాయి. ప్రశాంతమైన విహారయాత్రను కోరుకునే ప్రయాణికులకు ఈ ప్రదేశాలు మానసిక ఉత్తేజాన్ని అందిస్తాయి. లడఖ్ - అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, మఠాలు, నిర్మలమైన వాతావరణానికి లడఖ్ ప్రసిద్ధి. హిమాలయాల మధ్య ప్రశాంతమైన లడఖ్ ప్రయాణం మనలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది.
అద్భుతమైన పర్వత దృశ్యాలు
స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్ - తక్కువ జనాభా నివసించే ప్రదేశం స్పితి వ్యాలీ. రిమోట్ ఏరియాలో ఉండే ఈ వ్యాలీలో అద్భుతమైన పర్వత దృశ్యాలు,పురాతన మఠాలు, సంప్రదాయాలు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. లక్షద్వీప్ - లక్షద్వీప్ అత్యంత సుందరమైన ప్రదేశం.ఇక్కడి బీచ్‌లు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మనుష్యులకు దూరంగా ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి ఇది చక్కటి టూరిస్ట్ ప్లేస్. అండమాన్, నికోబార్ దీవులు -సహజమైన బీచ్‌లు,స్పష్టమైన జలాలు,చుట్టూ పచ్చదనం... అండమాన్, నికోబార్ దీవుల సొంతం. ప్రశాంతత కోసం ఈ దీవుల పర్యటన ఎంతో ఉపయోగపడుతుంది. గోకర్ణ, కర్ణాటక - గోకర్ణలో అందమైన బీచ్‌లు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.తక్కువ జనాభా , ప్రశాంతమైన బీచ్‌ల కోసం చూస్తున్న వారికి గోకర్ణ బెస్ట్ ప్లేస్.
ప్రశాంతత కోరుకునే వారికి చక్కని ప్రదేశం
కూర్గ్, కర్ణాటక - కూర్గ్ కాఫీ తోటలు, పొగ మంచు కొండలు, ప్రశాంతతకు మారుపేరు. ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ - రాన్ ఆఫ్ కచ్‌లోని ఉప్పు చిత్తడి నేలలు ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని, ప్రశాంత భావాన్ని అందిస్తాయి. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ - తవాంగ్ సహజమైన అందాలకు నెలవు. బౌద్ధ ఆరామాలు, ప్రశాంతమైన వాతావరణానికి తవాంగ్ ప్రసిద్ధి. మున్నార్, కేరళ - మున్నార్.. తేయాకు తోటలు, చల్లని వాతావరణం, సుందరమైన అందాలకు ప్రసిద్ధి. ప్రశాంతత కోరుకునే వారికి చక్కని ప్రదేశం.