ట్రావెల్: పక్షిలా మారి గాల్లో ఎగరాలనుందా? ఈ రోప్ వే ప్రయాణంతో సాధ్యమే
మనిషి గాల్లో ఎగరలేడు. కానీ గాల్లో ప్రయాణించే వాహనాన్ని తయారు చేయగలడు. అలాంటి వాహనాలకు అవసరమయ్యే దారులు కూడా సృష్టించగలడు. ఈ దారులకు రోప్ వే అని పేరు పెట్టుకున్నాడు. రోప్ వే పై నడిచే కేబుల్ కార్లో తిరుగుతూ భూమి మీద లోయల్నీ, పచ్చదనాన్ని పక్షిలాగా చూడవచ్చు. చెప్పుకోదగ్గ రోప్ వేస్ ఇండియాలో ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం. ఆలీ రోప్ వే - ఉత్తరాఖండ్: ఇండియాలోనే పొడవైన రోప్ వే ఇది. ఆసియాలోనే రెండవ పొడవైన రోప్ వే గా పేరు పొందిన ఈ రోప్ వే, 4కిలిమీటర్లు ఉంటుంది. కేబుల్ కార్ లో 20నిమిషాల ప్రయాణం చేయవచ్చు. జోషిమఠ్ నుండి ఆలీ వరకూ సాగే ప్రయాణంలో హిమాలయాలను చూడవచ్చు.
భారతదేశంలోని ప్రసిద్ధ రోప్ వేస్
గుల్ మర్గ్ రోప్ వే - జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లోని కాంగ్ డోరి స్టేషన్ ను గుల్ మర్గ్ రిసార్ట్ ను కలుపుతుంది ఈ రోప్ వే. దీనిమీద నడిచే కేబుల్ కార్ లో ఆరుగురు ప్రయాణం చేయవచ్చు. ఈ రోప్ వే పొడవు 2.5కిలోమీటర్లు ఉంటుంది. రంగీత్ వ్యాలీ కేబుల్ కార్ - డార్జీలింగ్: డార్జీలింగ్ అందాలను చూడాలంటే భారతదేశంలోని ఈ పురాతన రోప్ వేపై ప్రయాణం చేయండి. 2134మీటర్ల ఎత్తులో ఉంటుంది మానసాపుర కర్ణిమాతా రోప్ వే - ఉదయ్ పూర్ (రాజస్థాన్) మచ్చల హిల్స్ నుండి దీన్ దాయాల్ ఉపాధ్యాయ్ పార్క్ మధ్య ఈ రోప్ వే నడుస్తుంది. 387మీటర్ల పొడవు ఉంటుంది.