NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం
    తదుపరి వార్తా కథనం
    వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం
    ప్రపంచ ఆనంద నివేదికలో టాప్ లో ఉన్న ఫిన్లాండ్

    వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 21, 2023
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్చ్ 20వ తేదిన ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్, ప్రపంచ దేశాల్లో ఏయే దేశాల ప్రజలు ఎంత ఆనందంగా ఉంటున్నారో రిపోర్ట్ ఇచ్చింది.

    ఆ రిపోర్ట్ ప్రకారం ఫిన్లాండ్ దేశ ప్రజలు ఎక్కువ ఆనందంగా ఉన్నారు. అందువల్ల ఆనంద రిపోర్ట్ లో టాప్ లో నిలిచింది ఫిన్లాండ్.

    ఈ రిపోర్ట్ ని ఆ దేశాల తలసరి ఆదాయం, సమాజంలోని పరిస్థితులు, జీవితకాలం, తక్కువ అవినీతి మొదలగు విషయాలను పరిగణలోకి తీసుకుని తయారు చేస్తారు.

    రెండవ స్థానంలో డెన్మార్క్, మూడు, నాలుగవ స్థానాల్లో ఐస్ లాండ్, ఇస్రాయిల్ ఉన్నాయి. 5వ స్థానాన్ని నెదర్లాండ్ దక్కించుకుంది. న్యూజిలాండ్ 10, ఆస్ట్రేలియా 12, అమెరికా 15వ స్థానాల్లో ఉన్నాయి.

    ప్రపంచ ఆనంద నివేదిక

    మెరుగుపడిన ఇండియా స్థానం

    ఈ రిపోర్ట్ లో మొత్తం 146దేశాలు ఉన్నాయి. అందులో ఇండియా స్థానం 126. మనదేశం కంటే బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, చైనా దేశాల వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటున్నారు.

    కాకపోతే గతేడాదితో పోల్చితే 10స్థానాలను మెరుగుపర్చుకుంది ఇండియా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, యుద్ధ దేశాలైనా రష్యా, ఉక్రెయిన్ ల స్థానాలు మనదేశం కంటే మెరుగ్గా ఉన్నాయి.

    రష్యా 72వ స్థానంలో ఉంటే, ఉక్రెయిన్ 92స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆనందం అంచుల్లో ఉన్న దేశాల గురించి మాట్లాడుకుంటే అందులో ఆఫ్ఘనిస్థాన్, లెబనాన్ ఉన్నాయి.

    మొత్తానికి ఆనంద నివేదికలో ఇండియా స్థానం కాస్త మెరుగుపడినా, ఆశాజనకంగా లేదనీ, మరింత మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    ముఖ్యమైన తేదీలు

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ లైఫ్-స్టైల్
    వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు లైఫ్-స్టైల్
    పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ లైఫ్-స్టైల్
    అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025