ప్రపంచ ఆనంద దినోత్సవం: అత్యంత ఆనందంగా ఉన్న దేశాలు, భారతదేశ స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని థియేటర్లలో రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటుంది. అవును, ప్రతీ ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు. కానీ ఎంతమందికి అది దొరుకుతుందనేదే ప్రశ్న.
ముఖ్యంగా భారతీయులు ఆనందంలో చాలా వెనుకబడి ఉన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ సంతోష సూచీ 2022 తెలియజేసింది. ఈ సూచీలో మొత్తం 146దేశాలుంటే మన స్థానం 136గా ఉంది.
అంటే భారతీయుల్లో ఆనందం పాళ్ళు తక్కువే అని అర్థమైపోతుంది. మరి ఆనందాన్ని అత్యధికంగా అనుభవిస్తున్న దేశాలను చూసుకుంటే ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్ లాండ్, స్విట్జర్ ల్యాండ్, నెదర్లాండ్.. వంటివి మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కూడా ఆనందంలో మనకంటే మెరుగైన స్థానంలోనే ఉన్నాయి. ఇక ఆఖరు స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉంది.
ప్రపంచ ఆనంద దినోత్సవం
ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన ఆనంద దినోత్సవం
ఆనందం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకే దాని గురించి అవగాహన పెంచేందుకు 2013నుండి ఆనంద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి.
ఆనందంగా ఎందుకుండా? ఏయే అంశాల కారణంగా ఆనందం తగ్గిపోతోంది? ఆనందాన్ని పెంచే అంశాలపై అవగాహన పెంచి జీవనశైలిలో మార్పులు తీసుకురావడానికే ఆనంద దినోత్సవాన్ని జరుపుతారు.
ఆనందం ఎలా పెరుగుతుంది?
చిన్న చిన్న విషయాల వల్ల ఆనందం రెట్టింపవుతుంది. ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం బావుండాలి. ఆరోగ్యం బావుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.
సరైన ఆహారం, సరైన అలవాట్లు, సరైన అభిరుచులు, అన్నీ కలిపి ఆనందాన్ని మీకందిస్తాయి.
అంతేకాదు, దేశ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రాజకీయ స్థితిగతులు కూడా మనిషి ఆనందాన్ని డిసైడ్ చేస్తాయి.