
ప్రేరణ: ఒంటరిగా ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఎక్కువశాతం జనాలు ఒంటరితనాన్నే ఏకాంతం అనుకుని భ్రమపడుతుంటారు. ఈ రెండింటి మధ్య తేడాని ఒక్కమాటలో ఇలా చ్చెప్పవచ్చు.
అందరూ నిన్ను వదిలివేయడమే ఒంటరితనం. అందరినీ నువ్వు వదిలివేయడమే ఏకాంతం. ఎస్, దీన్ని వివరంగా విశ్లేషిస్తే, ఒంటరితనంలో నువ్వు బాధపడుతుంటావ్. ఒంటరి ఫీలింగ్ ని నువ్వు తట్టుకోలేవు.
ఒంటరితనం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలంటే జైల్ లో ఉన్న ఖైదీలను కలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళను చూడలేక, ఏ పనీలేక, ఏం చేయాలో అర్థం కాక ఆగమాగమైపోతారు.
అలాంటి ఒంటరితనం ఒక్కోసారి సాధారణ జనాలను కూడా కుదిపేస్తుంది. ఎందుకో తెలీదు, సడెన్ గా చుట్టూ ఉన్న అందరూ మాయమైపోతారు. ఒంటరిగా మిగలాల్సి వస్తుంది.
ప్రేరణ
మీతో మీరు స్నేహం చేయడమే ఏకాంతం
అయితే అనుకోని పరిస్థితుల వల్ల మీరు ఒంటరైపోతే, ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి దాకా మీతో పాటు చదువుకున్న స్నేహితులు అందరూ ఉద్యోగం కోసమై సడెన్ గా అమెరికా వెళ్ళిపోవచ్చు.
చేస్తున్న ఉద్యోగంలో మీకు సపోర్ట్ చేసే వారెవరూ ఉండకపోతుండవచ్చు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎక్కువగా పట్టించుకోవాలి. మీతో మీరు ఎక్కువగా స్నేహం చేయాలి.
మీ ప్రెజెన్స్ మీకు బోర్ కొట్టకుండా చూసుకోవాలి. అలా కావాలంటే మీరు మంచి హాబీ అలవాటు చేసుకోవాలి. ఆ హాబీలో మీరున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోవాలి.
అదే ఏకాంతం. ఆనందాన్ని అందరూ కోరుకున్నట్టే ఏకాంతాన్ని అందరూ కోరుకుంటారు. కానీ కొద్దిమందికే అదెలా ఉంటుందో అర్థమవుతుంది.