LOADING...
Vasantha Panchami: వసంత పంచమి 2026.. తేదీ, శుభ ముహూర్తం, సరస్వతి పూజ ఎలా చేయాలి?
వసంత పంచమి 2026.. తేదీ, శుభ ముహూర్తం, సరస్వతి పూజ ఎలా చేయాలి?

Vasantha Panchami: వసంత పంచమి 2026.. తేదీ, శుభ ముహూర్తం, సరస్వతి పూజ ఎలా చేయాలి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

వసంత పంచమి 2026 సందర్భంగా సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల విద్య, కళలు, జ్ఞానంలో అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం ఉంది. మాఘ మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చాలా మంది పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. 2026లో వసంత పంచమి ఏ తేదీకి వచ్చింది? ఆ రోజు శుభ ముహూర్తం ఎప్పుడో మరియు ఏం చేయాలని చూడండి.

Details

వసంత పంచమి 2026 తేదీ 

ప్రతి ఏడాది మాఘ శుక్ల పంచమినే వసంత పంచమిని జరుపుతారు. 2026లో పంచమి తిథి ప్రారంభం: జనవరి 23 ఉదయం 2:28 ముగింపు: జనవరి 24 ఉదయం 1:46 ఉదయ తిథి ప్రకారం పండుగను నిర్ణయించుకునే సంప్రదాయాన్ని అనుసరించి వసంత పంచమి 2026 - జనవరి 23న జరుపుకోవాలి. వసంత పంచమి పూజా ముహూర్తం (2026) వసంత పంచమి రోజున ప్రత్యేకమైన పూజా సమయం తక్కువగానే ఉన్నప్పటికీ, శుభయోగంగా అనుకూలంగా ఉంటుంది. పూజ ముహూర్తం ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 12:50 వరకు ఈ ఐదు గంటల వ్యవధిలో సరస్వతి దేవిని ఆరాధించడం ఉత్తమం.

Details

వసంత పంచమి మహత్యం

సరస్వతి దేవి విద్య, సంగీతం, కళలు, జ్ఞానం—ఈ అన్ని రంగాలకి దేవత. ఈ రోజున పూజిస్తే— విద్యార్థులకు చదువులో శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి కళా, సృజనాత్మకతలో పురోగతి జ్ఞానం, బుద్ధి, వివేకం అభివృద్ధి చెందుతాయి వసంత పంచమి నాడు పసుపు రంగు ఎందుకు? వసంత పంచమి రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. * ఇది వసంత ఋతువు చిహ్నాన్ని సూచిస్తుంది సరస్వతి దేవి కృప పొందుతారని నమ్మకం ఉంది ఇక పసుపు రంగులో ఉండే స్వీట్లు, పసుపు పువ్వులు దేవికి సమర్పించడం కూడా శ్రేయస్కరం.

Details

హోలీ పండుగకు ఆరంభ సంకేతం 

వసంత పంచమి నుంచి అధికారికంగా హోలీ ఏర్పాట్లు ప్రారంభిస్తారు. హోలీ పండుగ వసంత పంచమి తర్వాత 40 రోజులకు వస్తుంది. మొత్తానికి జనవరి 23, 2026 వసంత పంచమి, సరస్వతి దేవిని ఆరాధించడానికి అత్యంత శుభదినం.