ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం: ఈరోజు గురించి తెలుసుకవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని ప్రతీ ఏడాది జులై 12వ తేదీన నిర్వహిస్తారు.
పర్యావరణాన్ని హాని చేయని పేపర్ బ్యాగ్స్ వినియోగం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం తదితర విషయాలపై అవగాహన పెంచేందుకు ఈరోజును జరుపుతున్నారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల భూకాలుష్యం పెరుగుతోంది. దానివల్ల మానవాళి భవిష్యత్తుకు ప్రమాదం ఎదురుకానుంది.
భవిష్యత్తులో మనిషి జీవనం సజావుగా సాగాలంటే పర్యావరణానికి హాని చేయని వస్తువులను వాడాల్సి ఉంటుంది.
పేపర్ బ్యాగ్ డే రోజున మీరు మీ మిత్రులను, కుటుంబ సభ్యులను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ప్రోత్సహించాలి. దీనికోసం ఎలాంటి కొటేషన్లు పంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
Details
పేపర్ బ్యాగ్ డే రోజున పంచుకోవాల్సిన కొటేషన్లు
ఈరోజు చేసే చిన్న నిర్లక్ష్యం రేపు పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి.
ఈ భూమి మనందరిదీ, ఈరోజు దీన్ని పరిరక్షించుకుంటేనే రేపు దీని మీద మనకు నివాసం ఉంటుంది.
నేనొక్కడినే తప్పు చేస్తే ఏమవుతుందని అనుకోవద్దు. నిన్ను చూసి నీ పిల్లలు, కుటుంబం తప్పు చేస్తుంది. అప్పుడు ఒక్కరు కాస్తా వందలుగా తయారవుతారు. అందుకే మీ ఒక్కరు కూడా తప్పు చేయవద్దు.
నువ్వు పేపర్ బ్యాగ్స్ వాడుతున్నావంటే నీకు ఈ భూమి మీద అమితమైన ప్రేమ ఉన్నట్టే లెక్క. తనను బాగా చూసుకునేవారిని ఈ భూమి కూడా బాగా చూసుకుంటుంది.