ఆధార్ కార్డ్ స్కామ్: లాక్ వేసుకోకపోతే మీ అకౌంట్ లోంచి డబ్బులు మాయం
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా ఆధార్ కార్డు ద్వారా స్కాం జరుగుతోందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మీ ఆధార్ కార్డును ఉపయోగించి మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులను మాయం చేస్తున్నారు.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం(AePS) ద్వారా ఓటీపీ కూడా అవసరం లేకుండా మీ అకౌంట్ లో నుంచి డబ్బులను మాయం చేసేస్తున్నారు. దీనికోసం వేలిముద్రల సమాచారం, మీరు ఏ బ్యాంకులో అకౌంట్ ని కలిగి ఉన్నారనే విషయాలు అవసరం అవుతాయి.
మరో విషయం ఏంటంటే, మీ అకౌంట్ లో నుంచి డబ్బులు మాయమైన తర్వాత కనీసం మీకు మెసేజ్ కూడా రాదు.
ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, హోటల్స్ మొదలగు వాటి నుండి ఆధార్ నంబర్లను మోసగాళ్లు తీసుకుంటున్నారు.
Details
వేలిముద్రల సమాచారానికి లాక్ వేసుకోవాలి
ఒక్కసారి ఆధార్ నంబర్ దొరికిన తర్వాత వేలిముద్రల సమాచారాన్ని భూమి రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుండి ఇంకా ఇతర వ్యవస్థల నుండి సేకరిస్తున్నారు.
ఆ తర్వాత ఆర్టీఫిషియల్ సిలికాన్ థంబ్స్ ఉపయోగించి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు.
ఈ మోసం నుండి దూరంగా ఉండడానికి ఆధార్ కార్డు ఉన్నవాళ్లందరూ తమ వేలిముద్రల సమాచారానికి లాక్ వేసుకోవాల్సి ఉంటుంది.
mAadhar App లేదా UIDAI వెబ్ సైట్ లోకి వెళ్లి బయోమెట్రిక్ డాటా సమాచారాన్ని లాక్ చేయాలి.
దీనికోసం మీరు mAadhar App డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వెబ్ సైట్ లోకి వెళ్ళవచ్చు.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టింది.