LOADING...
Apple iPhone SE 4: ఐఫోన్‌ SE 4 లాంచ్ : ధర, ఫీచర్లు, మరిన్ని వివరాలు!
ఐఫోన్‌ SE 4 లాంచ్ : ధర, ఫీచర్లు, మరిన్ని వివరాలు!

Apple iPhone SE 4: ఐఫోన్‌ SE 4 లాంచ్ : ధర, ఫీచర్లు, మరిన్ని వివరాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సంస్థ తన కొత్త iPhone SE 4 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అధికారికంగా ఈ ఫోన్‌ గురించి కంపెనీ ప్రకటించకపోయినా, లీకైన సమాచారం ప్రకారం ఇది SE 4 అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కొంతమంది నిపుణులు దీనిని iPhone 16Eగా కూడా పిలుస్తున్నారు. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10:30 గంటలకు ఆపిల్ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. లాంచ్ ఈవెంట్‌ను ఆపిల్ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో లైవ్‌ ప్రసారం చేయనుంది. ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఈ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడికానున్నాయి.

వివరాలు 

iPhone SE 4 ఫీచర్లు (లీకైన సమాచారం ప్రకారం) 

6.01 అంగుళాల OLED స్క్రీన్ లేటెస్ట్‌ A18 బయోనిక్‌ చిప్‌ 48 MP రియర్ కెమెరా & 12 MP సెల్ఫీ కెమెరా 3300mAh బ్యాటరీ, 20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టైప్-C పోర్ట్‌ సపోర్ట్ టచ్ ఐడీ స్థానంలో ఫేస్‌ ఐడీ అల్యూమినియం ఫ్రేమ్‌ డిజైన్‌

వివరాలు 

ధర & లాంచ్‌ డీటైల్స్ 

గతంలో, iPhone SE 3 మోడల్‌ను యాపిల్‌ 2022లో ₹43,999 ధరకు విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం, iPhone SE 4 ధర ₹44,999 ఉండొచ్చని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, యాపిల్‌ ధరను పెంచాలని భావిస్తే, దీని ధర ₹50,000 వరకు వెళ్లొచ్చని చెబుతున్నారు. మొత్తం మీద, మరికొన్ని గంటల్లో అధికారిక సమాచారం వెలుగులోకి రానుంది. యాపిల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ ఫోన్‌ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు!