NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు 
    Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు

    Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు 

    వ్రాసిన వారు Stalin
    Jun 29, 2024
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్కామర్‌లు రూపొందించిన మరో మోసపూరిత వ్యూహంలో, డేటింగ్ యాప్‌ లలో బాధితుల ఎరకు న్యూఢిల్లీలోని కాబోయే బ్యూరోక్రాట్ 1.2 లక్షలకు మోసపోయాడు.

    స్కామర్‌ లు ఎలా మోసగిస్తారు. అందుకు ఎలాంటి వ్యూహం రూపొందిస్తారు.

    ఈ మోసం తాలూకు వివరాలు ఇలా వున్నాయి.

    ఓ వ్యక్తి టిండర్‌లో వర్షా అనే మహిళను కలిశాడు . వారిద్దరి మధ్య సత్సంబంధాలు పెరిగాయి.

    కొద్ది రోజుల తర్వాత, ఆమె పుట్టినరోజును జరుపుకోవడానికి తూర్పు ఢిల్లీ లోని వికాస్ మార్గ్‌లోని బ్లాక్ మిర్రర్ కేఫ్‌లో ఏర్పాట్లు చేసుకున్నారు.ఇక్కడే అతను 1,21,917.70 చెల్లించవలసి వచ్చింది.

    వివరాలు 

    స్కామ్ ఎలా బయటపడింది 

    ఒకసారి కేఫ్‌లో, ఇద్దరూ కొన్ని స్నాక్స్, రెండు కేకులు , ఆల్కహాల్ లేని డ్రింక్ ,నాలుగు షాట్‌లను ఆర్డర్ చేశారు.

    ఆ మహిళ ఏదో సాకు చూపి బయటకు వెళ్లిపోయింది.

    బిల్లు 1,21,917.70 చూడగానే అతనికి దాదాపుగా కళ్లు తిరిగినంత పని అయింది.

    ఇంతెందుకు చెల్లించాలని నిలదీశాడు.

    కట్టవల్సిందేనని కేఫ్ సహ యజమాని అయిన అక్షయ్ పహ్వాపట్టుబట్టాడు.

    చేసేది లేక ఆన్‌లైన్‌లో పూర్తి మొత్తాన్ని బదిలీ చేసేశాడు. చేసే వరకు చివరకు ఆ బ్యూరోక్రాట్ ను బెదిరించాడు.

    నగదు బదిలీచేయకపోవటంతో నిర్బంధించాడని పోలీసులకు అందిన ఫిర్యాదులో వుంది .

    వివరాలు 

    స్కామ్ విచారణ

    డేటింగ్ స్కామ్‌ కు సంబంధించి అతను వెంటనే స్థానిక అధికారులకు సంఘటనపై ఫిర్యాదు చేశాడు.

    ఇన్‌స్పెక్టర్ సంజయ్ గుప్తా నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం సమావేశమైంది.

    దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోనున్నట్లు NDTV తెలిపింది.

    విచారణలో, పహ్వా తాను అన్ష్ గ్రోవర్ , వంశ్ పహ్వాతో కలిసి బ్లాక్ మిర్రర్ కేఫ్‌ను నడుపుతున్నామని వెల్లడించాడు.

    అనుమానం లేని వ్యక్తులను తమ కేఫ్‌లోకి ఆకర్షించటానికి ప్రయత్నాలు చేసినట్లు అంగీకరించాడు.

    ఇందుకు డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించే "టేబుల్ మేనేజర్‌లు"తో కూడిన వారి పథకాన్ని అతను వెల్లడించాడు.

    వివరాలు 

    వెలుగులోకి స్కామ్ ఆపరేషన్, నకిలీ డేటింగ్ ప్రొఫైల్‌లు 

    వెర్షా అనే మహిళను 25 ఏళ్ల అఫ్సాన్ పర్వీన్‌గా గుర్తించారు.

    ఆమె అయేషా , నూర్ అనే మారు పేరులతో కూడా బయటకు వెళుతుంది.

    పోలీసులు ఆమెను ట్రాక్ చేసినప్పుడు, ఆమె షాదీ.కామ్‌లో పరిచయమైన వ్యక్తితో డేటింగ్‌లో మరొక కేఫ్‌లో కనుగొన్నారు.

    బాధితుల నుండి మోసం చేసిన డబ్బులో 15% తనకు వస్తందని, 45% టేబుల్ మేనేజర్లు , కేఫ్ మేనేజర్లు పంచుకున్నారని ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.

    మిగిలిన 40% యజమానులకు చేరిందని ఆమె వారి ఎదుట చెప్పుకొచ్చింది.

    వివరాలు 

    కార్యనిర్వహణ పద్ధతి

    పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు .

    బాధితురాలిని ఆర్యన్ వర్షా అనే పేరుతో సంప్రదించినట్లు కూడా వెల్లడైంది.

    అతను పర్వీన్ ఫోటోను వన్-టైమ్ వ్యూ మోడ్‌లో పంపాడు.

    ఆమె పుట్టినరోజును జరుపుకోవడానికి జూన్ 23న లక్ష్మీ నగర్‌కు ఆహ్వానించాడు.

    పర్వీన్, పహ్వాలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఫోన్‌లతో పాటు కేఫ్ రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    విచారణ కొనసాగుతోందని, ఇతర నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టెక్నాలజీ

    తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్  తెలంగాణ
    యూరోపియన్ శాస్త్రవేత్తల ఘనత: అంగారకుడి పై నుండి లైవ్ స్ట్రీమింగ్  శాస్త్రవేత్త
    మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    తవ్వకాల్లో బయటపడ్డ ఎలుగుబంటి ఎముకతో తయారు చేసిన సంగీత సాధనం  శాస్త్రవేత్త
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025