Page Loader
సరికొత్త  ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్
boAt వేవ్ ఎలక్ట్రా రూ. 1799 ధరకు లభిస్తుంది.

సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 24, 2022
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బ్రాండ్ boAT మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ అనుకూలమైన ధరతో లాంచ్ అయినప్పటికీ, ఇది బ్లూటూత్ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఇటువంటి ఫీచర్ ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లకు మాత్రమే పరిమితం అయ్యివుండేది. 2.5D వంపు తిరిగిన HD డిస్‌ప్లేను కలిగి ఉంది. అన్ని ఫిట్‌నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేసే 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌తో వస్తుంది. బ్రాండ్ కేటగిరీలో అత్యంత డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లలో ఒకటి boAt. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్‌లో 30కి పైగా స్మార్ట్‌వాచ్‌లను విక్రయిస్తోంది. boAt వేవ్ ఎలక్ట్రా భారతదేశంలో రూ. 1799 ధరకు లభిస్తుంది. స్మార్ట్ వాచ్ boAt అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

boAT

గూగుల్ అసిస్టెంట్, siri ను ఈ గడియారాన్ని కనెక్ట్ చేయచ్చు

లేత నీలం, నీలం, నలుపు, చెర్రీ బ్లోసమ్ రంగులలో అందుబాటులో ఉంది. boAt వేవ్ ఎలెక్ట్రా భారీ 1.81 HD డిస్ప్లేతో వస్తుంది. గడియారాన్ని boAt యాప్‌తో జత చేయవచ్చు, దీని ద్వారా మీరు 100+ వాచ్ ఫేస్‌లు, విడ్జెట్‌లు, మార్చుకునే అవకాశం ఉన్న రెండు మెను స్టైల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. boAt వేవ్ ఎలెక్ట్రాలో సరికొత్త బ్లూటూత్ చిప్‌ ఉంది, ముఖ్యంగా వాయిస్ కాల్‌ల కోసం సృష్టమైన కనెక్టివిటీని అందిస్తుంది. మీరు వాచ్‌లోనే గరిష్టంగా 50 కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు. ఆన్‌బోర్డ్ HD మైక్, స్పీకర్ ఫీచర్స్ తో స్మార్ట్‌ఫోన్‌ను అవసరం లేకుండానే కాల్స్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ గడియారం Google అసిస్టెంట్ లేదా Siriకి కనెక్ట్ చేయచ్చు.