జీవిత కాల కష్టాల్లో ఫేస్ బుక్.. ఉద్యోగుల ఉద్వాసన ఫేస్ బుక్ ని ముంచేయనుందా?
మెటాగా పేరు మార్చుకుని మెటావర్స్ సృష్టించడంలో బిజీగా ఉన్న ఫేస్ బుక్, ప్రస్తుతం తన జీవిత కాలంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటుంది. ఈ మేరకు సంస్థ సీటీవో (ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) ఆండ్రూ బాస్ వర్త్ తెలిపారు. మెటావర్స్ సృష్టిస్తున్న ఫేసు బుక్ మీద సంశయంతో చాలామంది ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోవడం వల్లే ఆ సంస్థలో 11వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అంటే దాదాపు 13శాతం పనిచేసే వాళ్ళను తొలగించింది ఫేస్ బుక్. ఐతే ప్రస్తుతం సవాళ్ళను ఎదుర్కొంటుంది ఫేస్ బుక్. వాటిని అతి త్వరలోనే అధిగమించి, తాము అనుకున్న ఆక్చువల్ మిక్సుడ్ రియాలిటీ, ఏఆర్ (ఆక్చువల్ రియాలిటీ), వీఆర్ గ్లాసెస్ సేవలను జనాలకు అందిస్తామని చెబుతున్నాడు.
ప్రపంచం ముందుకు తీసుకురావడంలో ఆరాటం
ప్రస్తుతం ల్యాబ్ లలో జరుగుతున్న పరీక్షలు ప్రపంచం ముందుకు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నానని, వాటిని చూస్తే మతిపోతోందని అన్నారు. భవిష్యత్తు అంతా వర్చువల్ రియాలిటీదే, అందుకోసం మేము ఎంతగానో శ్రమిస్తున్నాం. మా డెవలపర్స్ దీనికోసం బాగా కృషి చేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ మరింత బాగా పనిచేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వీఆర్ డివైజెస్ అనేవి ల్యాప్ టాప్ లని కనుమరుగయ్యేలా చేస్తాయని కూడా ఆండ్రూ బాస్ వర్త్ చెబుతున్నాడు. మొత్తానికి మెటా సృష్టించబోతున్న సరికొత్త సాంకేతికత ప్రపంచాన్ని చాలా మార్చనుంది. కానీ అదెంత వరకు సక్సెస్ అవుతుందో ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేరు. ప్రస్తుతం మెటావర్స్ క్రియేట్ చేయడానికి ఫేస్ బుక్ నుండి 20శాతం ఇన్వెస్ట్ మెంట్ వెళ్తోంది.