Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). ఇదొక సాంకేతిక విప్లవం. ఏఐ విషయంలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య వార్ నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన OpenAI సంస్థ ChatGPTని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ 'Bard'ను రెడీ చేస్తోంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇది పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోయినా, దీనికి వినియోదగారులు భారీగా ఉన్నారు. 'బార్డ్'కు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ప్రస్తుతం ఇది పరిమితమైన వినియోగదారులకు అందుబాటులో ఉంది. 'చాట్‌జీపీటీ', 'బార్డ్' ఈ రెండు కూడా లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్(LaMDA) ఆధారంగా పని చేస్తాయి. అంటే యూజర్ భాషలోనే ఏ ప్రశ్నకు అయినా సమాధానం ఇస్తాయి.
'చాట్‌జీపీటీ' లోపాన్ని అడ్వాంటేజీగా తీసుకున్న 'బార్డ్'
సమాచారం ఇచ్చే విషయంలో 'చాట్‌జీపీటీ' వద్ద ఒక లోపం ఉంది. అది 2021 వరకు సమచారాన్ని మాత్రమే కచ్చితంగా ఇస్తుంది. ఆ తర్వాత సమాచారాన్ని ఇవ్వడంలో అది విఫలమవుతోంది. ఈ లోపాన్ని అధిగమించడం ద్వారా 'చాట్‌జీపీటీ'ని వెనక్కి నెట్టాలని గూగుల్ భావిస్తోంది. ఆ దిశగా 'బార్డ్'ను రూపొందిస్తోంది. 'చాట్‌జీపీటీ' పూర్తిగా రెడీ అయితే పూర్తిస్థాయి సమాచారాన్ని అందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు కూడా పరిశోధన దశలోనే ఉన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటులోకి వస్తే కానీ 'చాట్ జీపీటీ', 'బార్డ్' మధ్య తేడాలను గుర్తించలేము. ఏది ఏమైనప్పటికీ రెండు దిగ్గజ సంస్థలు చాట్‌బాట్ టెక్నాలజీతో సాంకేతిక ప్రపంచంలో పెనుమార్పులను నాంది పలుకుతున్నాయి.