Page Loader
వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్
కోపైలట్ టీం సమావేశాలపై సారాంశాన్ని అందించగలదు

వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 17, 2023
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ 365 యాప్‌ల సేవల కోసం కోపైలట్‌ను పరిచయం చేసింది, GPT-4 సపోర్ట్ చేసే కోపైలట్ అనేది ఒక సహాయకుడి లాంటిది, ఇది వినియోగదారులకు వివిధ పనులను చేయడంలో సహాయపడుతుంది. కోపైలట్ అసిస్టెంట్, బిజినెస్ చాట్‌గా అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ బిజినెస్ యాప్‌ల సూట్‌లో వినియోగదారులు కోపైలట్ రెండు రకాలు అన్నారు. Word, Excel, PowerPoint, Outlook, మరిన్నింటితో సహా ప్రతి మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లో సహాయంగా ఉంటుంది. రెండవ రకంలో, బిజినెస్ చాట్ అన్ని మైక్రోసాఫ్ట్ 365 డేటా యాప్‌లలో ఉంది. అన్ని రకాల డేటాను ఒకే చాట్ ఇంటర్‌ఫేస్‌లోకి తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ గ్రాఫ్‌ని ఉపయోగిస్తుంది. కోపైలట్ ఇది సృజనాత్మకతను వెలికితీస్తుంది, ఉత్పాదకతను అన్‌లాక్ చేయగలదు, నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం 20 మంది వినియోగదారులతో కోపైలట్‌ను పరీక్షిస్తోంది

కొత్త కోపైలట్‌తో, ఇంటర్‌ఫేస్ - సహజ భాష ద్వారా టెక్నాలజీను మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ అనేది డాక్యుమెంట్‌లు, ప్రెజెంటేషన్‌లను రూపొందించగల చాట్‌బాట్. వర్డ్‌లో, ఇది ఇతర ఫైల్‌ల ఆధారంగా మొత్తం డాక్యుమెంట్ ను రూపొందించగలదు, దానిని ఎడిట్ చెయ్యచ్చు. పవర్‌పాయింట్‌లో, సాధారణ ప్రాంప్ట్‌తో వర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా ప్రెజెంటేషన్‌లను రూపొందించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కోపైలట్ టీం సమావేశాలపై సారాంశాన్ని అందించగలదు. ఇందులో ప్రతి ఒక్కరూ ఏమి చెప్పారు అనే డేటా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం 20 మంది వినియోగదారులతో కోపైలట్‌ను పరీక్షిస్తోంది. ఇది వినియోగదారులు వారి ఇన్‌బాక్స్‌లను నిమిషాల్లో క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.