ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ
దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు. H1B వీసా హోల్డర్లు రద్దు చేసిన 60 రోజులలోపు ఉద్యోగం వెతకాలి లేదా దేశం విడిచి వెళ్లాలి. ఉద్యోగం వెతుక్కునే హడావుడిలో ఉన్న ఉద్యోగులలో ఒకరు వందన్ కౌశిక్, మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసి, కొత్త అవకాశాల కోసం వెతుకుతూ లింక్డ్‌ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఎనిమిదేళ్లుగా పనిచేసిన కౌశిక్, ఈ వారం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపులలో అతని టీంతో పాటు ఉద్యోగం కోల్పోయారు.
కౌశిక్ మైక్రోసాఫ్ట్‌లో వివిధ స్థానాల్లో పనిచేశారు
కౌశిక్ మైక్రోసాఫ్ట్‌లో వివిధ స్థానాల్లో పనిచేశారు, ఇందులో బింగ్ లో కొత్త ప్రకటనలను ప్రారంభించడం, అజూర్‌లో అంతర్జాతీయ కస్టమర్‌లకు సపోర్ట్ ఇవ్వడం, ఇండోనేషియాలోని కంపెనీ కస్టమర్‌ల కోసం కొత్త భాషను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఆన్‌బోర్డింగ్ ఖర్చును తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచడంపై తాను కృషి చేశానని కౌశిక్ పంచుకున్నారు. తనను తొలగించినట్లు వార్తలు వచ్చిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, పై అధికారులు ప్రక్రియ పూర్తి చేయడానికి తొందరపడకుండా ఒకరికొకరు మద్దతునిచ్చారని గౌరవం, సానుభూతి, మద్దతును అందించడం ఆనందంగా ఉందని, తన రెండు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో, సహోద్యోగులు, నాయకత్వ బృందం నుండి అటువంటి సానుకూల, సహాయక వైఖరిని చాలా అరుదుగా చూశానని కౌశిక్ తెలిపారు.