Google Pay: గూగుల్ పే త్వరలో మీ వాయిస్‌ని ఉపయోగించి యుపీఐ చెల్లింపులను అనుమతిస్తుంది
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వాటిలో గూగుల్ పే (Google Pay) ఒకటి. గూగుల్ పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది.
ఈ ఫీచర్లలో కొన్ని యూజర్లను బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మరొక ఉపయోగకరమైన ఫీచర్‌ను కంపెనీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఈ కొత్త అప్‌డేట్‌తో, మీరు వాయిస్ ద్వారా UPI పేమెంట్స్ చేయవచ్చు.
చదవడం, రాయడం రాని వారికి, టైప్ చేయడం తెలియని వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిది.
భారత ప్రభుత్వానికి చెందిన 'భాషిణి AI ప్రాజెక్ట్' సహకారంతో గూగుల్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వివరాలు
కొత్త ఫీచర్‌తో, యూజర్లు మాటలతోనే పేమెంట్ చేయగలుగుతారు
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ చేయాలంటే చాలానే వివరాలు టైప్ చేయాల్సి ఉంటుంది.
కొంతమందికి ఇది భారంగా అనిపిస్తుంది. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ లేని వారు పేమెంట్లు చేయడంలో ఇబ్బంది పడతారు.
కానీ గూగుల్ పే తీసుకురాబోయే ఈ కొత్త ఫీచర్‌తో, యూజర్లు మాటలతోనే పేమెంట్ చేయగలుగుతారు.
ఇది డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లను చాలా సులభతరం చేస్తుంది. గూగుల్ పే ఇండియా ప్రొడక్ట్ మేనేజర్ షరత్ బులుసు ప్రకారం ఈ ఫీచర్ పేమెంట్ ప్రాసెస్‌ను చాలా సులభం చేస్తుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియకపోయినా, ఇది ఆన్‌లైన్ పేమెంట్స్‌కి సంబంధించిన విధానాన్నే మారుస్తుంది.
ఈ వాయిస్ ఫీచర్ 'భాషిణి AI ప్రాజెక్ట్'లో భాగంగా అందించబడింది.
వివరాలు
తృభాషలోనే పేమెంట్స్ చేయగలిగే అవకాశం
గూగుల్ ,భారత ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా మన దేశంలోని వివిధ భాషల్లో డిజిటల్ పేమెంట్స్ చేయడానికి సులభతరం చేయడం,చదవలేని,వృద్ధులకి వారి మాతృభాషలోనే పేమెంట్స్ చేయగలిగే అవకాశం అందించడం చేస్తుంది.
సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడం... ఆన్‌లైన్ మోసాలు,సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో, గూగుల్ AI, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి సెక్యూరిటీని మరింత మెరుగుపరుస్తోంది.
ఈ కొత్త ఫీచర్ కూడా యూజర్లను సైబర్ బెడదల నుంచి కాపాడే అవకాశం ఉంది.
AI సెక్యూరిటీ ఫీచర్లతో, గూగుల్ పే మరింత సురక్షితమైన పేమెంట్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.
వివరాలు
మార్కెట్లో గూగుల్ పే...
గూగుల్ పే ప్రస్తుతం UPI పేమెంట్ యాప్స్‌లో అగ్రస్థానంలో ఉంది.2024నవంబర్ రిపోర్ట్ ప్రకారం, మొత్తం UPI లావాదేవీల్లో గూగుల్ పే వాటా 37%,ఫోన్ పే 47.8% వాటాతో నంబర్ 1 స్థానంలో ఉంది.
ఈరెండు యాప్స్ కలిపి ఇండియన్ UPI మార్కెట్లో 80% పైగా వాటా కలిగి ఉన్నాయి.
ఈఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నది అందరికి ఆసక్తికరమైన ప్రశ్న.
గూగుల్ ఇంకా లాంచ్ డేట్ ప్రకటించలేదు.అయితే,ఇది విడుదల అయిన తర్వాత భారతదేశంలో డిజిటల్ పేమెంట్లు చేసే ప్రతి ఒక్కరికీ ఇది మంచి అనుభవాన్ని ఇచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తిగా తెలియకపోయినాఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, పేమెంట్ చేయడం ఎంత సులభమైందో మరింత స్పష్టంగా తెలుస్తుంది.