ఐఫోన్, ఐప్యాడ్ లలో సెక్యూరిటీ సమస్యలు.. అప్డేట్ చేయడమే సరైన మార్గం
ఆపిల్ iOS, ఐప్యాడ్OS డివైజులు హాకర్ల కంట్రోల్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-In) హెచ్చరికను విడుదల చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసు అయిన CERT-In సైబర్ సెక్యూరిటీ విషయంలో జాతీయ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఆన్ లైన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడమే కాకుండా ఏదైనా హానికారక ఇబ్బందులు ఆన్ లైన్ లో ఎదురైతే వాటిని CERT-In బయటపెడుతుంది. ప్రస్తుతం ఆపిల్ iOS ఐప్యాడ్OS డివైజులు సెక్యూరిటీ పరంగా హానికరంగా ఉన్నాయని తెలియజేసింది.
ఆపిల్ రిలీజ్ చేసిన సెక్యూరిటీ అప్డేట్
ఆపిల్ iOS, ఐప్యాడ్OS డివైజ్ లోని సెక్యూరిటీ ఇబ్బందుల కారణంగా, మీరు వాడే డివైజు హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లే అవకాశం ఉందని, దానివల్ల వ్యక్తిగత భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది. 16.7.1 కి ముందు వెర్షన్లు అయినా ఐపాడ్ iOS, ఐప్యాడ్OS డివైజుల్లో భద్రతా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. ఐఫోన్ 8, ఐప్యాడ్ ప్రో (అన్ని మోడల్స్) ఐప్యాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఐప్యాడ్ ఫిఫ్త్ జనరేషన్, ఐప్యాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్ మొదలవు డివైజుల్లో సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని సమాచారం. సెక్యూరిటీ విషయంలో సేఫ్ గా ఉండడానికి ఆపిల్ డివైజులు వినియోగించేవారు సెక్యూరిటీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. దీనికోసం ఆపిల్ support.apple.com/en-us/HT213972 అనే అప్డేట్ ని రిలీజ్ చేసింది.