Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్ జారీ చేసిన భారత ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భారీ భద్రతా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
విండోస్ లేదా మాకోస్ సిస్టమ్‌లలో క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) స్పష్టం చేసింది.
ముఖ్యంగా హ్యాకర్లు క్రోమ్ ద్వారా మీ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
బ్రౌజింగ్ సమయంలో అనుమతులు ఇచ్చే ముందు ఓసారి లేదా రెండుసార్లు పరీక్షించుకోవాలని సూచించింది.
స్కియా, V8 వంటి ప్లాట్‌ఫారమ్‌లను వినియోగిస్తున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదనంగా, ఎక్స్‌టెన్షన్ APIల సంస్థాపనను తగ్గించాలని సలహా ఇస్తున్నారు.
వివరాలు
డేటాను ఆటో సేవ్ చేస్తే,హ్యాకింగ్ ద్వారా ఖాతాలు ఖాళీ
ముఖ్యంగా,హ్యాకర్లు రిమోట్ దాడుల ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంక్ ఖాతాల వంటి సున్నితమైన డేటాను ఆటో సేవ్ చేస్తే,హ్యాకింగ్ ద్వారా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా,లినక్స్ 133.0.6943.53 కి ముందు గూగుల్ క్రోమ్ వెర్షన్‌లను ఉపయోగిస్తున్న వారికి ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు.
అలాగే,విండోస్,మ్యాక్ కోసం 133.0.6943.53/54 కి ముందు ఉన్న క్రోమ్ వెర్షన్‌ల్లో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
అందువల్ల, క్రోమ్ వినియోగదారులు తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రోమ్‌లో కుడి వైపున ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్ చేసి, మెను లోకి వెళ్లి అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.