ISRO: 2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగాములు: ఇస్రో మాజీ చీఫ్ కిరణ్ కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌గా ఉన్న కిరణ్ కుమార్, బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు. 2026 నుంచి 2040 మధ్యకాలంలో ఇస్రో వరుసగా అనేక అంతరిక్ష ప్రయోగాలను చేపట్టనుందని చెప్పారు. 2040లో చంద్రునిపైకి మనుషులను పంపించి, వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు.
వివరాలు
అంతరిక్ష సాంకేతికతను సైనికపరంగా కాకుండా సామాజిక అవసరాలకే..
అలాగే చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సంబంధించిన అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సమీప భవిష్యత్తులో మరిన్ని చంద్రయాన్ మిషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతరిక్ష సాంకేతికతను సైనిక ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల అవసరాలు, సామాజిక అభివృద్ధి కోసమే భారత్ వినియోగిస్తోందని కిరణ్ కుమార్ మరోసారి గుర్తు చేశారు.