JioTele OS: స్మార్ట్‌టీవీల కోసం రిలయన్స్ జియో టెలీ ఓఎస్‌ను.. ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి..
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ జియో సంస్థ స్మార్ట్ టీవీల కోసం జియోటెలీ ఓఎస్ (JioTele OS) ను పరిచయం చేసింది.
భారతీయ ప్రేక్షకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
స్మార్ట్ టీవీ కంటెంట్‌ను మరింత మందికి చేరువ చేయడం, ప్రాంతీయ కంటెంట్‌ను అందించడం జియోటెలీ ఓఎస్ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.
అందుబాటు ధరలో ప్రీమియం కంటెంట్‌ను, స్మార్ట్ టీవీ ఫీచర్లను జియోటెలీ ఓఎస్‌తో అందించవచ్చని కంపెనీ వివరించింది.
థామ్సన్, కోడక్, బీపీఎల్, జేవీసీ వంటి బ్రాండ్లు జియోటెలీ ఓఎస్‌తో పనిచేసే టీవీలు ఫిబ్రవరి 21 నుండి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
ఈ ఏడాది చివరిలో మరిన్ని బ్రాండ్లు ఈ ప్లాట్‌ఫామ్‌పై స్మార్ట్ టీవీలను విడుదల చేస్తాయని సూచించింది.
వివరాలు
ప్రధాన ఫీచర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పర్సనలైజ్డ్ కంటెంట్‌ను సిఫార్సు చేస్తుంది.
4K కంటెంట్‌ను అందించే టీవీల్లో ల్యాగ్ సమస్య ఉత్పన్నం కాదని , స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించవచ్చని తెలిపింది.
టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్, క్లౌడ్ గేమింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. సింగిల్ రిమోట్‌తో అన్ని రకాల కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
కొత్త యాప్స్‌కు సపోర్ట్ చేయడానికి, కొత్త సాంకేతికతను అందించడానికి ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది.
జియో సంస్థ గతంలో జియోటీవీ ఓఎస్‌ను పరిచయం చేసింది. జియో సెట్‌టాప్ బాక్సులకు సపోర్ట్ చేసే విధంగా టీవీ ఓఎస్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా పరిచయమైన జియోటెలీ ఓఎస్‌తో ఆయా బ్రాండ్లు టీవీలను విడుదల చేయనున్నాయి.
వివరాలు
ప్యూర్ ఈవీతో జియో థింగ్స్ జట్టు
ప్యూర్ ఈవీతో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్ ఎంవోయూ కుదుర్చుకుంది.
దీని ప్రకారం జియో థింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్‌ను ప్యూర్ ఈవీకి అనుసంధానం చేయనుంది.
అధునాతన ఐవోటీ సొల్యూషన్స్ ద్వారా తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు జియో థింగ్స్‌తో జట్టుకట్టినట్లు కంపెనీ తెలిపింది.