Loading...
Meta Max: ఏఐ హ్యుమనాయిడ్‌ రోబో వచ్చేసింది...మ్యాక్స్‌గా నామకరణం
ఏఐ హ్యుమనాయిడ్‌ రోబో వచ్చేసింది...మ్యాక్స్‌గా నామకరణం

Meta Max: ఏఐ హ్యుమనాయిడ్‌ రోబో వచ్చేసింది...మ్యాక్స్‌గా నామకరణం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 02, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు మనం ఏఐతో మాట్లాడాలంటే ఫోన్‌, కంప్యూటర్‌ లేదా ఇతర డిజిటల్‌ పరికరాలనే ఆశ్రయిస్తున్నాం. కానీ ఇకపై మన ఎదురుగా నిలబడి మాట్లాడే ఏఐ రోబో కూడా అందుబాటులోకి వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మీడియా దిగ్గజం మెటా ఈ ఆలోచనతోనే 'మ్యాక్స్‌' (Max) పేరుతో హ్యూమనాయిడ్‌ రోబో ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసింది. మెటా మిత్రదేశానికి చెందిన ఫోరియర్‌ రోబోటిక్స్‌ స్టార్టప్‌ సహకారంతో కేవలం మూడు నెలల్లోనే దీన్ని రూపొందించింది. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ లక్ష్యం ఏఐని యాప్‌లకే పరిమితం చేయకుండా, మనుషులతో నేరుగా మాట్లాడే భౌతిక రూపంలోకి తీసుకురావడం.

Details

ఐదు అడుగుల ఎత్తు.. మనిషిలా చేతులు

మ్యాక్స్‌ రోబో దాదాపు 5 అడుగుల ఎత్తు, 48 కిలోల బరువు ఉంటుంది. మనుషుల మాదిరిగా ఐదు వేళ్లతో కూడిన చేతులు, మాట్లాడేందుకు స్పీకర్లు ఇందులో ఉన్నాయి.

ముఖం ఉండాల్సిన స్థానంలో ప్రత్యేక స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా వినడం, ఆలోచించడం, మాట్లాడటం వంటి సందర్భాలకు తగిన హావభావాలను ప్రదర్శించగలదు.

చిన్న వస్తువులు, బొమ్మలను చేతులతో పట్టుకునే సామర్థ్యం కూడా ఉంది. ఫోరియర్‌ అందించిన హార్డ్‌వేర్‌ను ఆధారంగా తీసుకున్నప్పటికీ, మెటా తన అవసరాలకు తగ్గట్టుగా రోబో డిజైన్‌, కెమెరాలు, చేతులు, పాదాలు వంటి భాగాల్లో మార్పులు చేసింది.

Details

దూరం నుంచే మాటలు, సైగలను గుర్తింపు

మ్యాక్స్‌ పనితీరులో ఆసక్తికరమైన విషయం దాని సెన్సింగ్‌ సామర్థ్యం. మెటా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, ఇది 5 మీటర్ల దూరం నుంచి మనిషి గొంతును గుర్తించాలి.

అలాగే 3 మీటర్ల దూరం నుంచి చేతి సైగలను అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్న వ్యక్తి కళ్లలోకి చూస్తూ సంభాషించేలా దీన్ని రూపొందిస్తున్నారు.

ఎన్విడియా జెట్సన్‌ థోర్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఈ రోబోలో మనుషులతో సహజమైన సంభాషణకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

ADVERTISEMENT

Details

రెండో వెర్షన్‌పై మెటా దృష్టి

మ్యాక్స్‌ తొలి నమూనాతోనే మెటా ఆగిపోవడం లేదు. ఇప్పటికే రెండో వెర్షన్‌ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు సమాచారం.

ఇందులో చేతుల పనితీరును మెరుగుపరచడంతో పాటు, మెట్లు ఎక్కడానికి అవసరమైన సెన్సార్లు, విజువల్స్‌ చూపించే ప్రొజెక్టర్‌ వంటి సదుపాయాలను చేర్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం వీటిని వాణిజ్య విక్రయాల కోసం కాకుండా అంతర్గత పరిశోధనల కోసమే అభివృద్ధి చేస్తున్నట్లు మెటా ప్రతినిధి వెల్లడించారు.

ADVERTISEMENT

Details

హ్యూమనాయిడ్‌ రోబోల రంగంలో పెరుగుతున్న పోటీ

ప్రస్తుతం ఈ రంగంలో టెస్లా ఆప్టిమస్‌, ఫిగర్‌ కంపెనీ రోబోలు, 1X టెక్నాలజీస్‌ నియో వంటి నమూనాలు పోటీపడుతున్నాయి.

వీటి మధ్య మెటా కూడా తన స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా-ఇతర దేశాల మధ్య ఏఐ సాంకేతికత, హ్యూమనాయిడ్‌ రోబోల విషయంలో పోటీ కొనసాగుతున్న సమయంలో ఫోరియర్‌తో మెటా భాగస్వామ్యం ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి, ఏఐని కేవలం తెరపై కనిపించే సాఫ్ట్‌వేర్‌ నుంచి మనతో కలిసి పనిచేయగల యంత్రంగా మార్చే ప్రయత్నంలో 'మ్యాక్స్‌' ఒక కీలక ప్రయోగంగా నిలుస్తోంది.

ADVERTISEMENT