
Motorola Edge 60 Pro: మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. 6000mAh బ్యాటరీ, ఏఐ కెమెరాతో సూపర్బ్!
ఈ వార్తాకథనం ఏంటి
మోటోరోలా భారతీయ మార్కెట్‌లో వరుసగా తన స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది.
ఇటీవల మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్లను విడుదల చేసిన ఈ ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ, ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌లో మరో శక్తివంతమైన డివైస్‌ను తీసుకొచ్చింది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro). అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన కెమెరాలు, డిస్‌ప్లే సామర్థ్యం, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.
Details
ముఖ్య ఫీచర్లు
డిస్‌ప్లే: 6.7 అంగుళాల 1.5K pOLED స్క్రీన్, 120Hz రీఫ్రెష్ రేటుతో పాటు HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది.
4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌స్ట్రీమ్ చిప్‌సెట్‌తో వస్తోంది. 16 5జీ బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్: Out-of-the-boxగా ఆండ్రాయిడ్ 15తో వస్తోంది. మూడేళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యురిటీ అప్‌డేట్స్ హామీ ఇస్తోంది.
కెమెరాలు
వెనుక మూడు కెమెరాలు: - 50MP ప్రైమరీ కెమెరా
10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్)
50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా (మ్యాక్రోగా కూడా పనిచేస్తుంది)
ముందు కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా
Details
బ్యాటరీ: 6000mAh బ్యాటరీ సామర్థ్యం
90W టర్బో ఛార్జింగ్ - 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ఇతర ఫీచర్లు
IP68, IP69 వాటర్ రెసిస్టెన్స్
మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H ప్రమాణాలు
స్టీరియో స్పీకర్స్‌తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్
ధర, ఆఫర్లు
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ - రూ.29,999
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ - రూ.33,999
ఆఫర్లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1000 నుంచి రూ.1500 వరకు డిస్కౌంట్ లభించనుంది.
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే ఇది ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలవొచ్చు