Voyager 1: సంకేతాలు పంపిస్తోన్న వాయేజర్1
యాభై ఏళ్లు క్రితం నాసా (Nasa) ప్రయోగించిన వాయేజర్ 1 (Voyager 1) అంతరిక్ష నౌక తిరిగి పనిచేయడం ప్రారంభించింది. కొన్ని నెలలు జాడ తెలియకుండా పోయిన వాయేజర్ 1 నుంచి తమకు సంకేతాలు అందినట్లు నాసా వెల్లడించింది. తాము పంపే సిగ్నల్స్‌ను వాయేజర్ 1 రిసీవ్ చేసుకుంటున్నప్పటికీ గతేడాది నవంబర్14 నుంచి దాని నుంచి భూమికి సంకేతాలు రావడంలేదని నాసా తెలిపింది. అంతరిక్షంలో సూదూర ప్రయాణం కొనసాగించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్1 రికార్డు సృష్టించింది. 1977లో నాసా ప్రయోగించిన వాయేజర్1 ప్రస్తుతం సౌర కుటుంబాన్ని దాటి ఇంటర్ స్టెల్లార్ పరిధిలోకి ప్రవేశించింది.
సమస్య పరిష్కరించిన 48 ఏళ్ల నాటి కంప్యూటర్ కోడింగ్
భూమి నుంచి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయేజర్1 లో పనిచేయని ఒక చిప్ కారణంగా అందులో సమస్య ఏర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతరిక్ష నౌకలోని 48 ఏళ్ల నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. వాయేజర్ 1 లోని ఆన్‌బోర్డ్ ఇంజనీరింగ్ పనితీరు, ప్రస్తుతం అది ఏస్థితిలో ఉన్నది అనే కీలక సమాచారాన్ని తిరిగి ఇచ్చినట్లు నాసా వెల్లడించింది. వాయేజర్1కు, భూమికి మధ్య సమాచారం ట్రాన్స్ ఫర్ కావడానికి 22.5 గంటల సమయం పడుతోంది. గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని మావవాళికి అందించేందుకు ఈ వాయేజర్1 ఉద్దేశించబడింది. 2025 తర్వాత వీటిలోని బ్యాటరీలు పూర్తిగా క్షీణించనున్నాయి. తర్వాత దీని నుంచి సమాచారం బదిలీ కావడం ఆగిపోతుంది.