LOADING...
Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నథింగ్ కంపెనీ తమ తదుపరి స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ నథింగ్ ఫోన్ 3ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ జూలై 1న భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. అద్భుతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. లైవ్ లాంచ్ ఈవెంట్ నథింగ్ ఫోన్ 3 లాంచ్ ఈవెంట్‌ను జూలై 1 రాత్రి 10:30 గంటలకు యూట్యూబ్, ఇతర అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్‌లో వీక్షించవచ్చు.

Details

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు, ముఖ్య ఫీచర్లు 

డిస్‌ప్లే నథింగ్ ఫోన్ 3 లో 6.7 అంగుళాల ఫ్లాట్ AMOLED LTPO డిస్‌ప్లే ఉండనుంది. దీని రిజల్యూషన్ 1.5Kగా ఉండే అవకాశం ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, అత్యధికంగా 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించే సామర్థ్యం ఉండనుందని ఊహిస్తున్నారు. ప్రాసెసర్ & స్టోరేజ్ ఈ ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ పవర్ అందించనుందని సమాచారం. ఇందులో 12GB వరకు RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉండవచ్చునని భావిస్తున్నారు. బ్యాటరీ & ఛార్జింగ్ నథింగ్ ఫోన్ 3 లో 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండనుంది. ఇది 50W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది

Details

ఆపరేటింగ్ సిస్టమ్

ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత NothingOS 4పై రన్ కానుంది డిజైన్ గత మోడళ్లలో కనిపించిన గ్లిఫ్ లైటింగ్ సిస్టమ్‌కి బదులుగా, ఈసారి ఫోన్ రేర్ సైడ్‌లో కొత్త డాట్ మ్యాట్రిక్స్-స్టైల్ బ్యాక్ ప్యానెల్ ఉండవచ్చని ఊహిస్తున్నారు. కెమెరా సెటప్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. ఇందులో మూడు 50MP సెన్సార్లు ఉండవచ్చని, అవి ప్రధాన కెమెరా, అల్ట్రావైడ్, మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో లెన్స్‌లుగా ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉండనుంది.

Details

ఇతర ఫీచర్లు

ఫోన్‌కు IP68 రేటింగ్ ఉండే అవకాశం ఉంది, అంటే ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కూడా కావచ్చు. ధర (అంచనా) నథింగ్ ఫోన్ 3 బేస్ వేరియంట్ ధర 799 డాలర్లు (దాదాపు రూ. 68,000)గా ఉండవచ్చని అంచనా. అగ్ర వేరియంట్ అయిన 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 77,000)గా ఉండవచ్చని సమాచారం. ఈ ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది.