Page Loader
మార్స్ గ్రహంపై వింత పరిశోధన.. ఏకంగా పంట పండించేందుకు సిద్ధమైన శాస్త్రవేత్తలు!
మార్స్ గ్రహంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు

మార్స్ గ్రహంపై వింత పరిశోధన.. ఏకంగా పంట పండించేందుకు సిద్ధమైన శాస్త్రవేత్తలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2023
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉనికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. తాజాగా మార్స్ గ్రహంపై జీవం ఉనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ముఖ్యంగా అంగారకుడి మీదికి మనషులకు పంపించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ మనుషులతో కూడిన కాలనీలు ఏర్పాటు చేయలన్నదే తన లక్ష్యమని మస్క్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంగారకుడి మీదనే పంటలు పండించేందుకు పరిశోధనలు చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సస్ మార్స్ గ్రహంపై వరి పంటను పండించేందుకు సంబంధించిన ఓ పరిశోధన చేసింది. దీనికి అభిలాశ్ రామచంద్రన్ నాయకత్వం వహించాడు.

Details

శిలల పొడితో మార్స్ మీద మట్టిన తయారు చేసిన శాస్త్రవేత్తలు

అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ మీద ఉండే మట్టిని తయారు చేశారు. ఈ మట్టిలో మొక్కలు పెరిగేందుకు అవసరమైన మిశ్రమాలతో కలిసి కుండీల్లో నింపారు. తర్వాత దాంట్లో వడ్లను చల్లి రోజుకు రెండు సార్లు నీళ్లు పోయడంతో అశ్చర్యకరంగా ఆ కుండీల్లో వరి గింజలు మొలకెత్తాయి. అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ మీద ఉండే మట్టిని తయారు చేశారు. ఈ మట్టిలో మొక్కలు పెరిగేందుకు అవసరమైన మిశ్రమాలతో కలిసి కుండీల్లో నింపారు. తర్వాత దాంట్లో వడ్లను చల్లి రోజుకు రెండు సార్లు నీళ్లు పోయడంతో అశ్చర్యకరంగా ఆ కుండీల్లో వరి గింజలు మొలకెత్తాయి. భవిష్యతులో ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.