Loading...
Sarvam AI Model: ఏఐ రంగంలో సర్వమ్‌ భారీ ప్లాన్‌.. కొత్త మోడల్‌ కోసం రూ.1,800 కోట్ల ఖర్చు
ఏఐ రంగంలో సర్వమ్‌ భారీ ప్లాన్‌.. కొత్త మోడల్‌ కోసం రూ.1,800 కోట్ల ఖర్చు

Sarvam AI Model: ఏఐ రంగంలో సర్వమ్‌ భారీ ప్లాన్‌.. కొత్త మోడల్‌ కోసం రూ.1,800 కోట్ల ఖర్చు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సర్వమ్‌ ప్రస్తుతం 105 బిలియన్‌ పారామీటర్ల సామర్థ్యమున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్‌ను అందిస్తోంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కొత్త మోడల్‌ దానికంటే దాదాపు పది రెట్లు పెద్దదిగా ఉండనుంది. ఈ ఏడాది జూలై 30న జరిగిన డెవలపర్‌ సమావేశంలో సంస్థ తొలిసారిగా ఈ ప్రాజెక్టును ప్రకటించింది. కోడింగ్‌, సైబర్‌ భద్రత, సిమ్యులేషన్‌, సైన్స్‌ వంటి రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచేలా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మోడల్‌ శిక్షణ కోసం అవసరమైన జీపీయూ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అది సిద్ధమైన తర్వాత శిక్షణకు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని ప్రత్యుష్‌ కుమార్‌ తెలిపారు.

Details

ఏఐ మోడల్‌తో పాటు ఆదాయంపైనా దృష్టి

భారీ ఏఐ మోడల్‌ అభివృద్ధికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం కావడంతో, మరోవైపు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపైనా సర్వమ్‌ దృష్టి పెట్టింది.

కేవలం మోడళ్లను తయారు చేయడం మాత్రమే కాకుండా, వాటిని వినియోగదారులకు అందించి ఆదాయం పొందడం కూడా ముఖ్యమని ప్రత్యుష్‌ వివరించారు.

ఏఐ రంగంలో మోడళ్ల అభివృద్ధి, టోకెన్ల తయారీ ద్వారా సేవలు అందించడం అనే రెండు ప్రధాన వ్యాపార మార్గాలు ఉన్నాయని చెప్పారు.

భారత్‌కు తగిన స్థాయిలో పెట్టుబడులు సమీకరించాలంటే స్థిరమైన ఆదాయ వనరు చూపించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Details

టోకెన్‌ ఫ్యాక్టరీతో డెవలపర్లకు సేవలు

నవంబర్‌ 16న సర్వమ్‌ టోకెన్‌ ఫ్యాక్టరీని ప్రారంభించింది. సంస్థకు చెందిన జీపీయూలపై పనిచేసే ఏఐ మోడళ్లను డెవలపర్లు, కంపెనీలు వినియోగించుకుని, ప్రాసెస్‌ చేసే టోకెన్ల ఆధారంగా చెల్లింపులు చేసే అవకాశం ఇందులో ఉంది.

సర్వమ్‌ మోడల్‌తో పాటు గూగుల్‌, డీప్‌సీక్‌, మూన్‌షాట్‌ ఏఐ, జిపు ఏఐ సంస్థల ఓపెన్‌ వెయిట్‌ మోడళ్లనూ అందిస్తోంది.

వచ్చే నెలలో కంప్యూట్‌ రెంటల్‌ సేవలను ప్రారంభించి, ఇతర కంపెనీలు తమ ఏఐ వ్యవస్థలను నిర్మించుకునేందుకు కంప్యూటింగ్‌ శక్తిని అద్దెకు ఇవ్వనుంది. దీనికి తోడుగా 'సర్వమ్‌ ఫార్వర్డ్‌' పేరుతో శిక్షణ కార్యక్రమాన్నీ అందిస్తోంది.

ADVERTISEMENT