2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం
2022 కృతిమ మేధస్సుకు ఒక మైలురాయి లాంటి సంవత్సరం. OpenAI, Meta, DeepMind, Google, Baidu వంటి సంస్థలు తమ ప్రత్యుర్ధులకు ధీటుగా సరికొత్తగా AI మోడల్స్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం టాప్ ఐదు AI మోడల్స్ గురించి తెలుసుకుందాం OpenAI సంస్థ వారి ChatGPT, అత్యంత శక్తివంతమైన లాంగ్వేజ్ ప్రొసెసింగ్ టూల్స్ లో ఒకటి. సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడం, వ్యాసాలు రాయడం, వ్యాపార ఆలోచనలను రూపొందించడం అనేక అంశాలలో సహాయం చేయగలదు.ఇది సంభాషణ సమాధానాలను, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. రెండోది DALL-E 2 ఇది వాక్యాలను తీసుకొని సంబంధిత అసలైన చిత్రాలను రూపొందించడంలో సహాయం చేస్తుంది.
స్నేహితుల్లా వ్యవహరిస్తున్న వర్చువల్ సహచరులు
పెద్ద మాట్రిక్స్ గుణాకారాలు గణిత శాస్త్రవేత్తలకు క్లిష్టంగా ఉంటుంది. DeepMind వారి AlphaTensor ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకువచ్చింది. ఇది పెద్ద మాట్రిక్స్ గుణించడానికి సమర్థవంతమైన అల్గారిథమ్‌ను కనిపెడుతుంది. మెటా వారి CICERO గేమ్‌లో మానవ-స్థాయి పనితీరును సాధించిన మొదటి AI. ఆసక్తికరంగా, ఈ బోట్ 40 గేమ్‌లకు మానవ ప్లేయర్ గా గెలుపొందింది. లిన్ కైకై, యే యుయు 2022లో కష్టతరమైన సమయంలో చైనీస్ ప్రజలకు ఓదార్పునిచ్చారు. ఇద్దరూ ఒత్తిడి, ఆందోళన, కష్టాల్లో ఉన్నవారికి మానసిక సాంత్వన అందించారు. అయితే వాళ్ళు మనుషులు కాదు. Baidu సంస్థ రూపొందించిన AI సాధనంలో వర్చువల్ సహచరులు. 24 గంటలూ టెక్స్ట్, వాయిస్, ఎమోటికాన్‌ల ద్వారా మనుషులతో సంభాషణలలో ఈ వర్చువల్ సహచరులు పాల్గొంటారు.