Page Loader
అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు
2022లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 24, 2022
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

2022లో మెరుగైన, ఉపయోగకరమైన ఫీచర్స్ తో వినియోగదారులను మెప్పించిన టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే Pixel 7 Pro : అల్యూమినియం ఫ్రేమ్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను వంటి సదుపాయాలతో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల ప్యానెల్‌ తో పాటు 12GB RAM, 512GB స్పేస్, 10.8MP (f/2.2) సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14 Pro: ఎప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే తో 1-120Hz రిఫ్రెష్ రేట్, 2,000-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల LTPO OLED స్క్రీన్‌, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌, 6GB RAM, 1TB వరకు స్పేస్ అందిస్తుంది.

స్మార్ట్ ఫోన్

మడతపెట్టే డిజైన్ ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్

vivo X90 Pro+: IP68 వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్‌, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల 2K AMOLED ప్యానెల్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. OPPO Find N2 Flip : ఫోల్డబుల్ డిజైన్ తో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఆప్షన్ తో. ఆటో ఫోకస్‌ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో , 6.8-అంగుళాల పూర్తి-HD+ AMOLED ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్‌తో వస్తుంది. సామ్ సంగ్ Galaxy Z Fold4: మడతపెట్టే పుస్తకం లాంటి డిజైన్, IPX8 వాటర్ రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌, 10MP కవర్ సెల్ఫీ కెమెరా, 4MP అండర్ డిస్‌ప్లే కెమెరా వంటి ఫీచర్స్ తో వస్తుంది. .