ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజాభిప్రాయాన్ని గుర్తించి హైలైట్ చేయడానికి కృతిమ మేధస్సును ఉపయోగించనుందని ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్ శనివారం తన ట్వీట్ ద్వారా ప్రకటించారు.
కొన్ని రోజుల ముందు ట్విట్టర్ అల్గారిథమ్‌ను మార్చి మస్క్ తన ట్వీట్‌ల రీచ్‌ను స్థాయిని పెంచారనే ఆరోపణలను తోసిపుచ్చారు.
మార్చి 31 నుండి ట్వీట్‌లను రికమెండ్ చేయడానికి ఉపయోగించే అన్ని కోడ్‌లను ట్విట్టర్ ఓపెన్ సోర్స్ చేస్తుందని అతను ప్రకటించారు.
ప్లాట్‌ఫారమ్ అల్గోరిథం కంపెనీలో పనిచేసే వారికి పూర్తిగా అర్థం కాలేదని చాలా కష్టంగా ఉందని అతను పేర్కొన్నారు.
ఓపెన్ సోర్సింగ్ కోడ్‌లను అందరూ సులభంగా యాక్సెస్ చేయగలరు. ఆ కోడ్‌లను ఎవరైనా సరిచేయగలరు. అయితే ఇది ఇంకా పురోగతిలో ఉంది. అది కూడా ఓపెన్ సోర్స్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్వరలో ప్రవేశపెట్టబోతున్న ఫీచర్ గురించి ట్వీట్ చేసిన మస్క్
In the months ahead, we will use AI to detect highlight manipulation of public opinion on this platform.
— Elon Musk (@elonmusk) March 18, 2023
Let’s see what the psy ops cat drags in …
ట్విట్టర్
వందలాది ఖాతాలు దుర్వినియోగం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి
ప్లాట్‌ఫారమ్‌పై ఈమధ్య వందలాది ఖాతాలు దుర్వినియోగం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని BBC తన పరిశోధనలో పేర్కొంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ చర్య చేపడుతున్నారు.
ఇటీవలి BBC తన నివేదికలో ప్రస్తుత, మాజీ ఉద్యోగుల నుండి సేకరించిన సమాచారం ద్వారా ఇప్పుడు వినియోగదారులను ట్రోలింగ్, రాష్ట్ర ఆధారిత తప్పుడు ప్రచారాలు, పిల్లల లైంగిక దోపిడీ నుండి రక్షించే స్థితిలో లేదని పేర్కొంది.
అటువంటి పర్యవేక్షణకు అవసరమైన సాధనాలు కంటెంట్ భద్రత, నియంత్రణ ఉద్యోగుల తొలగింపుల కారణంగా నిర్వహించడం కష్టంగా మారిందని రుజువు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, ట్విట్టర్‌లో 2,000 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.