
Vivo T4 5G: 7300ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వివో టీ4 5జీ.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
7300ఎంఏహెచ్ బడా బ్యాటరీ, ఏఐ ఎడిటింగ్ ఫీచర్లతో కొత్తగా మార్కెట్‌లో దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ 'వివో టీ4 5జీ'. రూ. 25 వేల లోపలే లభ్యమవుతున్న ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. వివో టీ4 5జీలో 6.77 ఇంచుల క్వార్డ్ కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తోంది. స్మార్ట్‌ఫోన్ కేవలం 7.9ఎంఎం స్లిమ్‌గా, 199 గ్రాముల బరువుతో ఉంటుంది. అలాగే ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఈ మొబైల్‌కు లభించింది. కెమెరా సెటప్ విషయానికొస్తే, వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరాని అందించారు.
Details
7300ఎంఏహెచ్ భారీ బ్యాటరీ
పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్ వంటి స్మార్ట్ ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది తాజా ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై పనిచేస్తుంది. బ్యాటరీ ఈస్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. 7300ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. దీని వల్ల ఎక్కువ సేపు చార్జ్ అవసరం లేకుండా వాడుకోవచ్చు. అలాగే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఎక్కువ ఛార్జ్ పొందవచ్చు. డిజైన్ పరంగా ఇది ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ధర విషయానికి వస్తే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 21,999గా కంపెనీ ప్రకటించింది.